నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తరువాత క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని తో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ కు సరైన హిట్ దొరకలేదని చెప్పాలి.  వరుస అపజయాలతో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్న బాలకృష్ణ ఈ సినిమాతో తప్పకుండా వారికి హిట్ అందించాలని చాలా కష్టపడుతున్నాడట. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ సీనియర్ హీరోకు సక్సెస్ ను అందించలేకపోతున్నారు దర్శకులు.

దీంతో బోయపాటి శీను తో చేస్తున్న అఖండ సినిమా బాలయ్య తప్పకుండా హిట్ తీసుకువస్తుంది అని అందరూ భావిస్తున్నారు. గతంలో వీరిద్దరి సినిమాలు సూపర్ హిట్ లు కాగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు వీరు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ తో ప్రాజెక్టు ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా కరోనా రావడం వలన అఖండ సినిమా షూటింగ్ లేట్ కావడం వలన ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతుంది.

అక్టోబర్ 1 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ ప్రముఖ స్టూడియోలో ఇప్పటికీ  భారీ సెట్ ను నిర్మించారని తెలుస్తుంది. బాలకృష్ణ యాక్షన్ సినిమాలకు కొత్త కాకపోయినా షూటింగ్ మొదలు పెట్టడమే భారీ యాక్షన్ ఎపిసోడ్ అనగానే అభిమానులు కొంత కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల ఫలితాలు ఏ రేంజిలో ఉంటాయో చూడాలి. ఈ సినిమా నీ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అలాగే విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నాడు అనే వార్త ప్రచారమవుతోంది. అంతేకాదు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: