మెగా స్టార్
చిరంజీవి కెమెరా ముందుకు వచ్చిన మొదటి
సినిమా పునాది రాళ్లు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ చిత్రం విడుదలైంది మాత్రం
చిరంజీవి ఏడవ
సినిమా గా.. దాన్ని ఆయన ఇష్టంతో చేయలేదు. ఆ
సినిమా వాళ్ళు బాగా బలవంతపెట్టడంతో ఆ సినిమాను ఒప్పుకున్నారు. అప్పటికీ
మెగాస్టార్ చిరంజీవి ఫిలిం ఇన్స్టిట్యూట్ లోనే ఉన్నారు. అక్కడ నిబంధనల ప్రకారం కోర్సు పూర్తయ్యాక కానీ సినిమాల్లో నటించకూడదు.
ఒకసారి ఎవరికోసమో
చిరంజీవి వెళుతూ అనుకోకుండా ఒక
ప్రొడ్యూసర్ ను కలిశారు. ఆయన
చిరంజీవి ను చూసి తమ సినిమాల్లో నటించమని అడిగారు. అయితే కోర్సు పూర్తయ్యేదాకా నేను నటించకూడదని అని
చిరంజీవి చెప్పగా మాకు అర్జెంటుగా మీలాంటి ఒక యాక్టర్ కావాలి షూటింగ్ కు వెళ్తున్నాం అని ఆ
నిర్మాత చెప్పాడు. దాంతో
మెగాస్టార్ చిరంజీవి ఇన్స్టిట్యూట్లో పర్మిషన్ తీసుకుని మీ సినిమాలో నటించడానికి చెబుతాను అని చెప్పగా అలా ఆయన చేసిన
సినిమా పునాదిరాళ్లు.
ఇకపోతే
చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఈ పేరు మరీ పొడవుగా ఉందని ఏదైనా మంచి పేరు పెడదాం అనుకున్నారు ఆయన స్నేహితులు. అప్పట్లో
శంకర్ అనే ఓ ఆర్టిస్ట్ ఉండేవారు. అలాగే అప్పటికే యాక్టర్ ప్రసాద్ బాబు చిరు స్నేహితుడి గా ఉన్నారు. అదే టైం లో ఒకరోజు
చిరంజీవి కి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయన ఓ గుడిలో పూజ చేసుకుంటున్నారు. ఆయన స్నేహితులలో ఒకరు
చిరంజీవి అని పిలిచారు. నా పేరు శివశంకర వరప్రసాద్
చిరంజీవి కాదు అని చెప్పాడు. సరిగ్గా మెలకువ వచ్చాక తన ఫ్రెండ్స్ తో ఈ విషయం చెప్పారు. నువ్వు కూడా మంచి పేరు ఏదైనా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. కదా బహుశా ఆంజనేయస్వామి తన పేరునే నీకు సూచించి ఉంటారు. అని వారన్నారు. అప్పటిదాకా
చిరంజీవి అనే పేరు ఉంటుందని ఆయనకు తెలియదు.