అందులో ఎన్టీఆర్‌ను పోలిన క్యారెక్టర్ ఉండేది. ఆ క్యారెక్టర్‌ను అప్పుడే కెరీర్ ప్రారంభించిన కోట శ్రీనివాసరావును అనుకున్నారు. ఆయన అప్పట్లో ఓ బ్యాంకులో పని చేసేవారు.. సినిమాల్లోనూ ఒకటీ రెండు పాత్రలు చేస్తుండేవారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ వేయాలని కోట శ్రీనివాసరావును కృష్ణ తదితరులు పదే పదే అడిగారు. చివరకు కోట కూడా అంగీకరించారు. పేరు వస్తుంది కదా అని భావించారు. అయితే ఆయన తీసుకున్న ఆ నిర్ణయం చాలా కాలం ఆయన్ను వెంటాడింది.
ఆ మండలాధీశుడు సినిమా విడుదలయ్యాక.. కోటకు బాగా పేరొచ్చింది. ఆ సినిమా పేరుతో పాటు శత్రుత్వమూ తెచ్చింది. సినీరంగంలో ఎన్టీఆర్ అనుకూలురంతా కోటాను వెలివేసినట్టుగా భావించారు.అందులోనూ అప్పట్లో ఎన్టీఆర్ సీఎం కూడా కదా. ఆ ఒక్క పాత్ర చేసిన కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డానని కోట తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఆ సినిమా చేసిన తర్వాత ఓసారి రాజమండ్రి ఓ షూటింగ్ కోసం వెళ్లారట. అక్కడ బాలయ్య కూడా వేరే షూటింగ్ కోసం వచ్చారట. ఇద్దరూ ఓ హోటల్‌లోనే బస చేశారు. ఉదయమే బయటకు వెళ్దామని కోట కిందకు వచ్చారట. లిఫ్ట్ వద్ద బాలయ్య ఎదురయ్యారట. తనపై బాలయ్యకు కోపం ఉంటుందని తెలిసినా.. కనిపిస్తే పలకరించాలి కదా అన్న భావంతో.. నమస్కారం బాబూ అంటూ కోట బాలయ్యకు నమస్కరించారట. అంతే బాలయ్య మారు మాట్లాడకుండా కోటా ముఖాన ఉమ్మేసి వెళ్లిపోయారట. ఆ విషయాన్ని తాజాగా ఇంటర్వ్యూలో చెప్పిన కోట.. తన తండ్రిని తిడితే ఎవరికి మాత్రం కోపం ఉండదు అంటూ సర్దిచెప్పుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి