
ఓడిపోయిన చోటు ఒంటరి అయిపోతాం
శిఖరం చెంత నిల్చొని ఏడ్చేస్తాం
వెతికితే కొన్నే నీడలు మనకు అనుసరణ అవుతాయి
కొన్ని దారి చూపి గొప్ప ఊరట ఇస్తాయి..
జీవితంలో ఓడిపోవడం అన్నది ఇష్టం కావాలి
లేదా గెలుపును నిలుపుకోలేం.. బాగా రాణించండి ఏం కాదు
పుట్టిన రోజు - ప్రతిరోజు కన్నా భిన్నం అని రాయడం సులువు. పుట్టిన రోజును మరొక స్ఫూర్తిని వెతుక్కోవడం కష్టం.ఈ పుట్టిన రో జు తనకు జీవితాన్ని ఇచ్చిన డ్యాన్స్ మాస్టర్లను సత్కరిస్తున్నాడు చిరు. వారే లేకుంటే నేనేక్కడ అని ప్రశ్నిస్తున్నాడు. వారి రు ణం తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు ఈ పుట్టిన్రోజుకు థాంక్స్ చెబుతున్నాడు. రోజుకు థాంక్స్.. కాలానికి థాంక్స్..నడక దిద్దిన వారికి థాంక్స్.. నాన్న ఎక్కడున్నా సంతోషిస్తాడు. ఇంత మంచి కొడుకుగా ఆయన ఎదిగినందుకు. కానిస్టేబుళ్లంతా ఆనందించాలి తమ కొడుకులు ఆ స్థాయి చేరుకునేందుకు..ఇదిగో ఇతడే ఓ ఉదాహరణ అని చెప్పి తీరాలి. చెబుతున్నారు కూడా! కొన్నేళ్లుగా...
సముద్రాన్ని చూసి నవ్వుకున్నాడు
అలసిపోయి ఓ తీరాన్నీ చేరి నవ్వుకున్నాడు
ఆంధ్రాలో ఉంటూ పెరిగాడు..చెన్నయ్ లో ఉంటూ ఎదిగాడు.. ఎదగడంలో ఉన్నంత ఆనందం ఎదిగేందుకు చేసిన కృషి ముందు చి న్నబోతుంది. ఆ విధంగా ఆయన కృషి పెద్దది.. కష్టం పెద్దది.. పెద్ద గీత అని రాయాలి. ఆ పెద్దగీత ఇప్పట్లో ఎవ్వరూ దాటలేరు. దా టేందుకు స్థాయి ఉన్నా శక్తి చాలదు. శక్తి ఉన్నా ఆ సాహసం వారిలో లేదు. వారికి ఇంకొంచెం కష్టం అవసరం. తనంటే ఇష్టం అయి న తమ్ముళ్లు కష్టపడితేనే సంతోషించాడు. సత్యదేవ్ లాంటి ఆర్టిస్టులు కష్టపడి ఇంతటివారయ్యారు అంటే అందుకు తానే ఓ స్ఫూర్తి అని తెలుసుకుని పొంగిపోయాడు. చాలా మందికి మేలు చేశాడు. సినిమాలు చేయడం కన్నా స్వశక్తికి విలువ ఇవ్వడంతో చిరును ఓ దారి చూపి మేలు చేశాడు. ఇతరుల ఇంటి విజయాలను తన ఇంటి విజయాలుగా ఎలా భావించాడో ఆ విధంగా ఎందరికి కాను కలు అందించాడో తెలుసుకుంటే మరో స్ఫూర్తి. నీవు నా సినిమాలో పాట పాడతావు నేనున్నాను అని చెప్పాడట ఓ సారి రఘు కుంచె అనే సింగర్ కు..నీవు పాడినా పాడకున్నా నా మనసు ఎప్పుడో గెలిచావ్ అని కూడా చెప్పాడట! రవితేజకూ, శ్రీకాంత్ కూ ఇవే మాటలు చెప్పాడు. ఇంటికి పిలిచి ధైర్యం ఇచ్చి పంపాడు కృష్ణ వంశీకి.. ఏ ఓటమిలోనూ తాను ఒంటరి అని భావించలేదు. ఆ స్ఫూర్తే మరో కానిస్టేబుల్ కొడుకుకి ప్రేరణ కావొచ్చు. సాధారణ కుటుంబాలకు ఇప్పటికీ అతని కష్టం ఓ చెదరని జ్ఞాపకం. ఓ వికాస పాఠం...
ఫ్యామిలీ మేన్ .. ఒన్ అండ్ ఓన్లీ..
మంచి నటుడు అనేందుకు కొన్ని మాత్రమే అవసరం అవుతాయి. మంచి మనిషి అనుకునేందుకు కొన్ని మాత్రమే ప్రామాణికం అవుతాయి. చిరు కొందరిలో మంచి నటుడు.. చిరు కొందరికి మంచి నటుడు.. కొందరిలో అనే మాట ఇండస్ట్రీకి.. కొందరికి అన్నది
అభిమానులకు.. కష్టం మాత్రమే నమ్ముకుంటే ఇప్పటికీ ఊళ్లో ప్రతి ఒక్కరూ మెగాస్టార్ తోనే పోలుస్తారు. మరో! పోలిక రానివ్వరు.కానీ మెగాస్టార్ అనే పదం దగ్గర ఆయనకే కాదు నాలాంటి వారెందరికో హక్కు ఉంది. ఆయనే కాద్సార్ కష్టపడి జీవితాన్ని గెలిచిన ప్రతి ఒక్కరూ మెగాస్టారే ! అవునా కాదా చెప్పు ఆచార్య! లవ్ యూ ఆచార్య.. నువ్వు కాదు నేనే మెగాస్టార్ .. నువ్వు జస్ట్ చిరం జీవిగానే ఉండు....... నీ కీర్తికి కొనసాగింపు నేను..నేను అనగా నీ అభిమానిని......జేబుల్లో డబ్బులు ఉన్నా లేకున్నా నీ పాటలు విని, నీ మాటలు విని పొంగిపోయేంత శక్తి ఎందరో నాలాంటి సామాన్యులకు ఇచ్చి నీవు ఆనందాలకు ప్రతినిధివి అయ్యావు. చిరాయువును ఇచ్చావు. ఆ చిరకీర్తి నీది కాదు మాది. లవ్ యూ అన్నయ్యా.. హ్యాపీ బర్త్ డే ...