అంతేకాదు ఒకప్పుడు ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ కి కూడా మెగాస్టార్ అధ్యక్షత వహించాడు.. అంటే ఆ హీరో అంటే మెగాస్టార్ కు ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం కూడా లేదు. ఇంతకు ఆ హీరో ఎవరు అనే కదా మీ ఆలోచన..? ఆయన ఎవరో కాదు ఈస్ట్ మన్ కలర్స్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కు ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఉండేది. ఇక ఈ అసోసియేషన్ కు మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షత వహించారు.
ప్రస్తుతం ఈ విషయం తెలిసిన సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు అలాగే మెగాస్టార్ అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ హీరో గా చలామణి అవుతున్న సమయంలో, మెగాస్టార్ చిరంజీవి ఒక యువకుడు మాత్రమే. యువకుల్లో ఫ్యాన్స్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఈ కారణంగానే అప్పట్లో కృష్ణ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే సరికొత్త టెక్నాలజీ అంటే చిరంజీవికి మహ బాగా ఇష్టమట. అంతే కాదు ఆయన నటన ,గాంభీర్యం బాగా నచ్చడంతో సూపర్ స్టార్ కృష్ణ కు వీరాభిమాని అయ్యాడు మన మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈ వార్త ఆ నోటా ఈ నోటా తెలిసి ,సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి