పెద్ద సినిమాలు విడుదల చేయడానికి స్టార్ హీరోలు సైతం భయపడుతున్న వేళ శర్వానంద్ మంచి కాన్ఫిడెన్స్ తో తన అప్ కమింగ్ సినిమాను విడుదల తేదీ నీ అనౌన్స్ చేశాడు. శర్వానంద్ ప్రస్తుతం
మహా సముద్రం
సినిమా ను
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్
అజయ్ భూపతిదర్శకత్వంలో చేసిన విషయం తెలిసిందే. సిద్ధార్థ మరో కథానాయకుడిగా నటించగా అను ఇమ్యనూయెల్ మరియు
అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటించారు. ఈ
సినిమా కి పెద్దగా హిట్లు లేవు శర్వానంద్ కి..
దాంతో శర్వా కి తప్పకుండా హిట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ ఎంతో మంది హీరోలు రిజెక్ట్ చేసిన
సినిమా అయినా మహాసముద్రం చేయడం మొదలుపెట్టాడు. ఈ సినిమాను హీరోలు వద్దనడానికి కారణం ఏదైనా కూడా శర్వా ఒప్పుకోవడం ఒక్కసారిగా
ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చింది. అయితే ఈ
సినిమా అప్డేట్లు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగించిన మాట వాస్తవం. దాంతో ఈ
సినిమా కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు ప్రేక్షకులు.
కాగా ఈ చిత్రాన్ని
అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేసింది. మొదటినుంచి శర్వానంద్ కు రిస్క్ లు చేయడం అలవాటే. ఎవరి
సినిమా ఉన్నా కూడా తన సినిమాను విడుదల చేసి
సక్సెస్ సాధిస్తూ ఉంటాడు. గతంలో పెద్ద పెద్ద హీరోల సినిమాల విడుదల సమయంలోనే తన సినిమాలు కూడా విడుదల చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు కూడా
దసరా సందర్భంగా అఖండ, ఆచార్య, ఆర్ ఆర్ ఆర్ వంటి
సినిమాలు ఉన్న కూడా మహాసముద్రం సినిమాను విడుదల చేయడానికి మొగ్గు చూపి మరొకసారి తన ధైర్యాన్ని చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ
సినిమా ఆయనకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి. ఈ
సినిమా తర్వాత పలు ఆసక్తికర సినిమాలు చేస్తున్నాడు శర్వా.