ప్రముఖ దర్శకుడు టీ. కృష్ణ కొడుకుగా గోపీచంద్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదట విలన్ గా అడుగుపెట్టిన ఈయన, ఆ తర్వాత హీరోగా యజ్ఞం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. ఇకపోతే గత కొద్ది సంవత్సరాలుగా వరుస డిజాస్టర్ లు చూసిన తర్వాతనే ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై , ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు గోపీచంద్. ఇకపోతే ఈ చిత్రం సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం . ఇక ఈ సందర్భంగా గోపీచంద్ ప్రమోషనల్ కోసం ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూవర్ మీకు వరుస ఫెయిల్యూర్ రావడానికి గల కారణం ఏమిటి..? అని అడిగినప్పుడు గోపీచంద్ ఇలా సమాధానం ఇచ్చాడు..


గోపీచంద్ మాట్లాడుతూ ..నా దగ్గరికి సరైన స్క్రిప్ట్ ఒకటి కూడా రాలేదు. ఇంక వచ్చిన వాటిని సరిగ్గా ఎన్నుకో లేకపోయాను. ముఖ్యంగా నాకు అభిమానులను వేచి ఉండేలా చేయడం ఇష్టం లేదు.. నేను కూడా ఎక్కువ రోజులు వేచి ఉండలేను.. అందరి కంటే నేను కొంచెం డిఫరెంట్ మైండ్సెట్ అని కలిగి ఉన్నాను.. కాబట్టి ఫ్లాప్ లు రావడానికి కారణం అయింది.. నేను ఎంచుకునే కథలన్నీ కొంచెం డిఫరెంట్ ఎలిమెంట్స్ తో కూడుకున్నవే అయినప్పటికీ , ఆ సినిమాను చేయడంలో ఫెయిల్ అయ్యాను.. కథ బాగున్నప్పటికీ విజువల్స్ బాగలేక సినిమాలు ఫెయిల్ అయ్యాయి అన్నట్లు చెప్పుకొచ్చాడు

ఇకపోతే సీటీ మార్ కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
గోపీచంద్ ఇందులో ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు  కోచ్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా  తమన్నా నటించనున్నారు.. తమన్నా జ్వాలారెడ్డి అనే ఒక ఫైరింగ్ లేడీ గా మనకు కనిపించబోతోంది.. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే .ఇక శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇకపోతే గోపిచంద్ ఈ సినిమాపై పెట్టుకొన్న ఆశలు.. ఈ సినిమా ద్వారా నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: