తాజాగా శ్రియా ఆమె భర్త ఆండ్రూ కొచ్చిన్ ఇరువురు రోడ్డుపై మీడియాకు కనిపించారు. దాంతో ఆ సెలబ్రిటీ జంటను ఫోటోకి పోజులివ్వమని మీడియా అడిగితే, అడిగిందే లేటు బాహ్య ప్రపంచంలో ఉన్నామన్న విషయాన్ని పూర్తిగా మరచి తన భర్త ఆండ్రూ కి డైరెక్ట్ గా లిప్ టు లిప్ కిస్ ఇచ్చేసారు శ్రియా. అటు ఆండ్రూ కూడా తిరిగి అదే పని చేశారు. వీరిద్దరూ ఒకసారి రెండు సార్లో కాదు ముచ్చటగా మూడు సార్లు లిప్ లాక్ లతో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ సెలబ్రిటీ జంట. దాంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ మారి నెటిజన్ల ట్రోల్స్ మధ్య చిక్కుకుంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం పబ్లిక్ లో ఏంటి పిచ్చి పనులంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు శ్రియ కు హాలీవుడ్ గుర్తొచ్చిందేమో అంటున్నారు.
ఏదేమైనా వ్యక్తిగతంగా ఉండాల్సిన కొన్ని విషయాలను నలుగురి మధ్య పెడితే ఇలాగే ఉంటుందంటూ గుసగుసలు వినపడతున్నాయి. గతం లోనూ శ్రియ, తనకు తన భర్తకు చెందిన కొన్ని పర్సనల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలాంటి ట్రోల్స్ నే ఎదుర్కోగా, ఇపుడు మరో సారి అలాంటి పనే చేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది. అంతే కాదు పెళ్లి తర్వాత శ్రియ గ్లామర్ డోస్ అంతకంతకూ పెంచి కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి