స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం సీటీ మార్.. ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా ప్రేక్షకులను అలరిస్తున్నాడు అని చెప్పవచ్చు.. ఇకపోతే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మంచి హిట్ ను అందుకుంది.. కనివిని ఎరుగని రీతిలో మొదటి రోజు 3.3 కోట్ల రూపాయల షేర్ ను కాబట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పవన్ కుమార్ సమర్పణలో.. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ సినిమాలో తెలంగాణ కబడ్డీ కోచ్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించగా, రెండవ హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ నటించి మెప్పించింది.


సెప్టెంబర్ 10వ తేదీన మహా గణనాథుని చవితి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం గణనాధుని ఆశీర్వాదంతో విఘ్నాలు  తొలగిపోయి, మంచి విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. అంతేకాదు వరుస డిజాస్టర్ లతో కొట్టుమిట్టాడుతున్న గోపీచంద్ కు వినాయకుడు ఆశీర్వాదం లభించింది అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం

1. నైజాం    - రూ.2.31 కోట్లు
2.సీడెడ్     - రూ.1.65 కోట్లు
3.ఉత్తరాంధ్ర - రూ.    1.13 కోట్లు
4.ఈస్ట్ గోదావరి    - రూ. 0.88 కోట్లు
5.వెస్ట్    గోదావరి - రూ.0.51 కోట్లు
6.గుంటూరు    - రూ.1.02 కోట్లు
7.కృష్ణా    - రూ.0.53 కోట్లు
8.నెల్లూరు - రూ.    0.46 కోట్లు


ఏపీ + తెలంగాణ రాష్ట్రాలలో రూ.    8.49 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 0.34 కోట్లు
ఓవర్సీస్     రూ.0.10 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా రూ.8.93 కోట్లు.. సాధించింది.
 
ఇక ‘సీటీమార్’ చిత్రానికి మొత్తంగా రూ.13.23 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఇక  మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.8.93 కోట్ల కలెక్షన్ ను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో రూ.4.30 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ సినిమా మొత్తంగా విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి మరి.మరింత సమాచారం తెలుసుకోండి: