ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో ఒక సాదా సీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆది ఇక ఆ తర్వాత హైపర్ ఆది గా మారిపోయాడు. కొన్ని రోజుల్లోనే ఏకంగా జబర్దస్త్ టీం లీడర్ గా మారిపోయిన ఆది.. ఇక ఆ తర్వాత ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్నాడు. చాలామంది బుల్లితెర ప్రేక్షకులు హైపర్ ఆది స్కిట్ కోసమే అటు జబర్దస్త్ చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆది. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న టాప్ కమెడియన్స్ లో హైపర్ ఆది ఒక్కరుగా కొనసాగుతున్నారు.



 ఇకపోతే హైపర్ ఆది కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాదు అటు ఈటీవీ లో ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు.  అయితే బుల్లితెరపై ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆదికీ పెళ్లి జరిగిపోయింది..  అదేంటి ఆది ఎవరికీ చెప్పకుండనే పెళ్లి చేసుకున్నాడా అని ఆశ్చర్య పోతున్నారు కదా అయితే హైపర్ ఆది పెళ్లి జరిగింది నిజజీవితంలో కాదు బుల్లితెరపై స్కిట్ లో భాగంగా. హైపర్ ఆది జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో కూడా  తనదైన శైలిలో అలరిస్తూ ఉన్నాడు.



 ఈ క్రమంలోనే ఈ సారి కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వాహకులు సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఇటీవలే విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇక ఈ ప్రోమో లో భాగంగా.. హైపర్ ఆది హిమజా ని పెళ్లి చేసుకుంటాడు.. ఈ క్రమంలోనే వారికి ఉదయం 5 గంటల సమయంలో శోభనం ఫిక్స్ చేస్తారు. ఇక హైపర్ ఆది హిమజ ఉదయం 5 గంటల వరకు పడుకోకుండా మేలుకొని ఉండేందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ వారు ఎంటర్టైన్మెంట్ అందిస్తారు.  ఇలా సరికొత్తగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: