ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ, ఇక హీరోయిన్లలో రష్మిక మందన్న లకు ఉన్న క్రేజ్ వేరు. వీరు ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. అలాగే వీరిద్దరి జోడీకి కూడా ఫాలోయింగ్ మాములుగా లేదు. వీరిద్దరి కాంబో వెండి తెరపై కనిపించింది అంటే ఇక ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు. ఇక హాల్ అంతా ఈలలు, గోలలతో రచ్చ రచ్చే. అంతగా వీరి జోడీకి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. మొదటి సారి గీత గోవిందం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ఈ జంట ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. వారి లవ్ లో ముంచేసింది. అందులోనూ ఈ సినిమాలో వీరి మధ్య లిప్ లాక్ యువతను కేక పెట్టించింది. సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాలోనూ వీరి కెమిస్ట్రీ పీక్స్ కు చేరింది.

వీరి లవ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అయితే వీరి లవ్ ఆన్ స్క్రీన్ లో మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఇంకా స్ట్రాంగ్ అని చాలా వార్తలే వచ్చాయి. వీరి ఫ్రెండ్షిప్ బాండింగ్ బయట  కొనసాగించడం వీలు దొరికినప్పుడల్లా కలుస్తూ, తరచూ టచ్ లో ఉండటంతో అప్పట్లో సోషల్ మీడియాలో వీరి మధ్య ఏదో ఉందని పుకార్లు  షికార్లు చేశాయి. అంతే కాదు యాడ్స్ కూడా వీరు కలసి చేయడంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఒక జోడీ హిట్ టాక్ తెచ్చుకుంది అంటే అదే కాంబినేషన్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ఇండస్ట్రీలో సదా మామూలే. దాన్ని పట్టుకుని ఏవేవో అనుకుంటే మాకేంటి అన్నట్టుగా గాసిప్స్ ఎంజాయ్ చేస్తుంటారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.

అయితే ఇపుడు మరో తాజా న్యూస్ వీరి రిలేషన్ అంతకు మించి అన్నట్టు కథనాలకు బలమిస్తోంది. విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో రష్మీక మందన్ననే హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ న్యూస్ విని వీరి అభిమానులు సంతోషపడుతూ ఉంటే...ఇంకొందరు మళ్ళీ మొదలయ్యిందిగా అంటున్నారు. ఏదేమైనా ఈ సూపర్ సక్సెస్ జంట మళ్ళీ వెండి తెరపై మ్యాజిక్ చేసి కనువిందు చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: