పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు, ఈ సినిమాలో ఆలియాభట్ ,ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తుండగా అజయ్ దేవగన్, సముద్రకని ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా దేశంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తుంది, ఆ మధ్య కాలంలో ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది, కాకపోతే ఈ సినిమాను దసరా కు కూడా విడుదల చేయడం లేదు అని సంక్రాంతి కానుకగా జనవరి ఏడవ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ మధ్యే అఫీషియల్ గా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా పూర్తి అయిపోయింది.

మిగిలి ఉన్న కొన్ని కొన్ని పనులను చకచకా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా డబ్బింగ్ పనులను ఒక్కరోజు లోనే ముగించేస్తుంటారు, కాకపోతే రాజమౌళి మాత్రం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో దగ్గరుండి డబ్బింగ్ పూర్తి చేయించినట్లు తెలుస్తోంది, ఇద్దరు హీరోలతో పాటు మిగిలిన నటీ నటుల డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పోతే ఆర్ఆర్ఆర్ సినిమా చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ కాపీ నవంబర్ లో పూర్తిచేయాలననే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను డిసెంబర్ నుంచి మొదలు పెట్టాలని నెల రోజుల పాటు అత్యంత ప్రముఖంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లు చేసి, సినిమాను ప్రేక్షకుల కు మరింత దగ్గర చేయడానికి ప్రయత్నాలు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: