మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొండ పొలం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమా ఉప్పెన సినిమా తో పరిశ్రమకు పరిచయం అవడమే కాకుండా భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్.  ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే తన రెండో సినిమా కూడా పూర్తి చేసుకొని సినిమాల విషయంలో తాను ఎంత పకడ్బందీగా ఉంటానో అనేది నిరూపించుకున్నాడు వైష్ణవ్.  షూటింగ్ పూర్తి చేసుకున్న సరైన సమయం కోసం చూసి దసరా సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన విడుదల అయ్యింది ఈ సినిమా.

ప్రేక్షకులను బాగానే అలరించిన ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఆత్మనూన్యత భావం కలిగిన ఓ యువకుడు పట్టణంలో ఉద్యోగం సంపాదించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి అడవికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ అడవి ఏ విధంగా అతన్ని ధైర్యవంతుడు గా మార్చింది అనేదే ఈ సినిమా కథ. ఈ చిత్రం ముఖ్యంగా యువకులను ఉద్దేశించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలనే భావనతో తెరకెక్కించాడు దర్శకుడు.

ఓ వ్యక్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొని అత్యున్నత స్థాయికి చేరుకోవడం అనేది అందరిలో ఆత్మస్థైర్యం నింపే విషయం. ప్రస్తుత కాలంలో యువకులు చాలా మంది ఈ ఆత్మనూన్యత భావం తో బాధపడుతున్నారు. పెద్ద పెద్ద ఇంటర్వ్యూలలో, గ్రూప్ డిస్కషన్స్ లో పాల్గొనడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.  తద్వారా వారు తమ బంగారు భవిష్యత్తును ప్రమాదంలో కి నెట్టివేసుకుంటున్నారు.  ఆ భావాన్ని ఎలా జయించి వారు తమ జీవితంలో ముందడుగు వేయాలని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు అని చెప్పవచ్చు.  ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే ప్రతి ఒక్క యువకుడు తప్పకుండా చూసి తీరాల్సిందే. ఈ సినిమా ఓ ఐఏఎస్ ఇంటర్వ్యూ తో సమానం. 

మరింత సమాచారం తెలుసుకోండి: