ఇటీవల కాలంలో ప్రేక్షకుల పంథా మారింది. కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే అటు దర్శకులు కూడా భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఎంతో మంది కొత్త దర్శకులు కూడా కొత్త కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలు సాధించాలని భావిస్తున్నారూ. దీంతో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే..  ఇటీవలి కాలంలో అయితే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు ఎన్నో ప్రేక్షకాదరణ పొందుతూ ఉండడం గమనార్హం.

 చాలామంది దర్శకులు కూడా ఇలా నిజ జీవిత సంఘటనల ఆధారంగానే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా మరికొన్ని రోజుల్లో ఇలాంటి ఒక సినిమానే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో శ్రీరామ్. ఇక శ్రీ రామ్ హీరోగా సంచితా పదుకొనే హీరోయిన్ గా అసలేం జరిగింది అని ఒక సినిమా తెరకెక్కింది. ఎన్వి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎక్స్ డోస్ మీడియా పతాకంపై నిర్మించారు.


 ఈనెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం నిర్ణయించింది. ఈ క్రమంలోనే జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాతలు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాము అంటూ తెలిపారు. అదృశ్య శక్తి తో ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా అంటూ తెలిపారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ సరికొత్తగా ఊహకందని విధంగా ఉంటుందని చిత్రంలోని ప్రతి సన్నివేశం కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ హారర్ సినిమా ప్రేక్షకులందరికీ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: