భాను శ్రీ.. బుల్లితెరపై పలు షో లలో యాంకర్ గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ అని చెప్పవచ్చు. తన గంభీరమైన వాయిస్ తో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే నైజం భాను శ్రీ ది..మొన్నటి వరకు కేవలం బుల్లితెరకే పరిమితమైన భానుశ్రీ ప్రస్తుతం వెండితెరపై అడుగులు వేసి తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తోంది.. ఇప్పటికే ఈమె కొన్ని సినిమాలలో నటించినప్పటికీ హీరోయిన్గా నల్లమల సినిమాలో నటించడానికి సిద్ధమైంది.. ఇక ఈ సినిమాలో ప్రముఖ విలన్ గా గుర్తింపు పొందిన అమిత్ తివారి హీరోగా నటించబోతున్నాడు..

క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ రచయిత తనికెళ్ళ భరణి, అజయ్ ఘోష్, చత్రపతి శేఖర్, నాజర్, కాలకేయ ప్రభాకర్ తోపాటు చలాకి చంటి, ముక్కు అవినాష్, కాశీ విశ్వనాథ్  తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది..కాబట్టి అక్టోబర్ 29 2021 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాలో "ఏమన్నావే పిల్ల ఏమున్నావే".. పాట మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది..

ఈ మధ్యనే ఈ పాటను విడుదల చేయగా యూట్యూబ్ లో కూడా కొన్ని మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని, ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇకపోతే ఈ పాటకు సిడ్ శ్రీరామ్ తన గాత్రం తో ప్రేక్షకులను మైమరపించి చేస్తున్నారు.. ఇక ఈ సినిమా కూడా త్వరలోనే విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఇందులో నటిస్తున్న నటీనటులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని మనం కూడా కోరుకుందాం.. అంతే కాదు హీరోయిన్ గా తొలి అడుగులు వేసిన భానుశ్రీ కెరియర్ కూడా మంచి మలుపు తీసుకోవాలని ,ఎలాగైనా సరే ఆమె ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: