తెలుగు వాడైనా తమిళనాట హీరోగా సెటిల్ అయ్యాడు హీరో విశాల్. అయితే ఆయన మొదటి నుంచి ఎక్కువగా తమిళ సినిమా ల పైనే దృష్టి పెట్టాడు.  విశాల్ హీరోగా నటించిన సినిమా లలో తెలుగులో తొలిసారిగా విడుదలైన చిత్రం పందెం కోడి.  తమిళనాట మాస్ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2005వ సంవత్సరంలో విడుదలై తెలుగులో మంచి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.

జీకే ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై విక్రమ్ కృష్ణ నిర్మాణ సారథ్యంలో లింగు స్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశాల్ సరసన మీరాజాస్మిన్  హీరోయిన్ గా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు. చదువుల నిమిత్తం తన స్నేహితుడు ఇంటికి అతిథిగా వెళతాడు హీరో. అయితే అది ఎక్కువగా గొడవలు జరిగే రాయలసీమ ప్రాంతం కావడంతో కళ్ళెదుట జరిగే అన్యాయాన్ని ఎదిరిస్తారు హీరో. ఆ విధంగా ఈ సినిమాలో విలన్ ఓ వ్యక్తిని చంపబోతు ఉండగా  అతని ఎదురించి ఆ వ్యక్తిని కాపాడతాడు.

ఆ సమయంలోనే తనంటే భయపడే జనం అందరి ముందు అవమానించేలా కొడతాడు హీరో. తనకు జరిగిన ఆ అవమాన భారాన్ని మనసులో పెట్టుకున్న విలన్ హీరో ఊరికి వచ్చి ఏ విధంగా తన పగ తీర్చుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. హీరో కూడా పెద్ద ఫ్యాక్షనిస్టు కుటుంబానికి చెందిన వాడు కావడంతో అతని ఎదిరించడానికి ఏ విధంగా ప్రణాళికలు వేశాడు. ఆ క్రమంలో ఎలా చిత్తు అయ్యాడు అనేదే ఈ సినిమా కథ. రాజ్ కిరణ్ ముఖ్య పాత్రలో నటించగా ఆయన పాత్ర ఈ సినిమాకు హైలైట్ అయ్యింది అని చెప్పవచ్చు. తెలుగులో విశాల్ ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి ఆ తర్వాత ఆయన అనేక సినిమాలు తెలుగు లో రావడానికి కారణం అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: