తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ ఎంతటి క్రేజ్ ను సంపాదించుకున్నారో అంతకంటే ఎక్కువ స్థాయిలోనే అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే బాలకృష్ణ ఒకవైపు వరుస సినిమా ప్రాజెక్టులతో దూసుకెళ్తూ ఉండగా, మరోవైపు రాజకీయాలలో తన తండ్రి స్థాపించిన టిడిపి పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గా , తనదైన శైలిలో ప్రజలను ఆదుకుంటూ ఆయనకంటూ ఒక మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.. అంతేకాదు హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ తప్ప మరేవరు పోటీ చేసినా అక్కడి గెలిచే అవకాశాలే లేవు..

అంతలో తన సేవా కార్యక్రమాలతో అభివృద్ధి పథకాలతో హిందూపురం ఒక మహానగరంగా మార్చి.. ఎమ్మెల్యే అలాగే హీరోగా గుర్తింపు పొందుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆయనను ముఖ్యమంత్రి కానివ్వకుండా కొన్ని దుష్ట శక్తులు తొక్కేస్తున్నప్పటికీ ప్రజలలో మాత్రం మంచి ఆదరణ పొందుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో ద్విపాత్రాభినయం చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నాడు.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, పాటలు విడుదల చేయగా ప్రేక్షకులలో విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలకృష్ణను ఒక డిఫరెంట్ యాంగిల్ లో మనం చూడవచ్చు. అంతేకాదు మరోవైపు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే అనే షో నిర్వహించడానికి రెడీ అవుతున్నాడు. ఈ షో కి సంబంధించిన ప్రోమోను కూడా బుధవారం సాయంత్రం విడుదల చేయగా మంచి విశేష ఆదరణ పొందుతోంది..


సెలబ్రిటీ టాక్ షో గా నిర్వహించబోయే ఈ షోలో బాలకృష్ణ యొక్క కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ తో పాటు అన్ని కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆహా లో ప్రసారమయ్యే ఈ షో తో నిర్మాతలకు కాసుల పంట కురిపించడానికి సిద్ధమవుతున్నాడు బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: