సూపర్ స్టార్ రజినీకాంత్ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో శౌర్యం శంఖం వంటి మాస్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గా మంచి పేరు తెచ్చుకున్న శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో కూడా హిట్ సినిమాలను తెరకెక్కించిన శివ ఈ చిత్రాన్ని తన పాత సినిమాల తరహాలోనే భారీ రేంజ్ లో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కాగా రజినీకాంత్ తన నట విశ్వరూపాన్ని చూపించాడని చెప్పవచ్చు.

ఖుష్బూ మీనా ప్రకాష్ రాజ్ వంటి వారు ముఖ్య పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో జగపతిబాబు కనిపిస్తున్నాడు. ఈ చిత్రం కథ మొత్తం కీర్తి సురేష్ పాత్ర చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చాడు. రజనీకాంత్ ధైర్యంగా ఆడపిల్ల ఉంటే ఆ దేవుడే దిగి వచ్చి తనకు తోడుగా ఉంటాడు అనే డైలాగ్ సినిమా లైన్ ఏంటో పూర్తిగా చెప్పేసింది. సంగీత దర్శకుడు ఇమాన్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ట్రైలర్ లో ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా కనిపించింది. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఉందని చెప్పవచ్చు. 

వరుసగా యంగ్ దర్శకుల తో సినిమాలు చేస్తూ రజనీకాంత్ గతంలో లేని విధంగా దూసుకు పోతూ ఉండగా ఈసారి యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ తో చేతులు కలిపాడు. మరి గత రెండు సినిమాలు ఫ్లాపులు అందుకున్న రజనీకాంత్ ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి వస్తాడా అనేది చూడాలి. దీని తర్వాత రజనీకాంత్ మరి కొన్ని సినిమాలను ఒప్పుకోగా అవి ఆయన కెరీర్లోనే వెరైటీ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏదేమైనా రజనీకాంత్ సినిమాలు చేయడం ఆయన అభిమానులను ఎంతగానో ఖుషీ చేస్తుందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: