అయితే మొన్నటి వరకు బొండు మల్లెలా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు జీరో సైజ్ ట్రై చేసి సన్నగా మారిపోయింది. అయితే ఒక్కసారిగా బరువు తగ్గి సన్నగా అవ్వడం తో ఈ అమ్మడిని చూసి తెలుగు ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న f3 సినిమాలో నటిస్తున్న ఈ హీరోయిన్ అదే సమయంలో మరికొన్ని సినిమాలతో కూడా బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఇటీవలే విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు మారుతి తెరకెక్కించిన మంచిరోజులు వచ్చాయి అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది మెహ్రీన్.
ఈ క్రమంలోనే ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీవాలి సందర్భంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అయితే ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఈ క్రమంలోనే దర్శకుడు మారుతీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మెహ్రీన్ ఫిర్జాదా. దర్శకుడు మారుతి అంటే తనకు నమ్మకం అని తెలిపింది మెహ్రీన్ ఫిర్జాదా. ఆయన దర్శకత్వంలో నటించిన మంచి రోజులు వచ్చాయి అన్న సినిమా ఈనెల 4వ తేదీన విడుదల కాబోతున్నట్లు తెలిపింది. అయితే తాను కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఓ రోజు మారుతి సార్.. నుంచి కాల్ వచ్చింది సినిమా చేయాలని కోరగా కథ కూడా వినకుండా ఒప్పుకున్న. ఎందుకంటే మహానుభావుడు సినిమాలో తనను బాగా చూపించినట్లుగానే మరో సినిమాలో కూడా చూపిస్తాడు అన్న నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి