వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గని. మొదటి నుంచి వెరైటీ చిత్రాలను వినూత్నమైన కథలున్న సినిమాలను ఎంచుకుని టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన పేరు సొంతం చేసుకుంటున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఆయన గత చిత్రం గద్దలకొండ గణేష్ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలవగా ఆ తర్వాత ఆయన స్పోర్ట్స్ డ్రామాగా గని అనే సినిమాను చేస్తుండగా ఈ చిత్రం తనకు తప్పకుండా మంచి విజయాన్ని తెస్తుందని భావిస్తున్నారు హీరో.
ఇటీవలే ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదల కాగా ఈ పాట ప్రతి ఒక్కరిలో ఎంతో స్ఫూర్తిని నింపేలా ఉంది. బాక్సర్ గా వరుణ్ తేజ్ ఈ పాటలో ఎంతో కష్టపడుతున్నాడు.ఆయన తమ్ముడు సినిమా లోని పవన్ కళ్యాణ్ ని గుర్తు చేశాడని అందరూ వరుణ్ తేజ్ ప్రశంసించారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఎంతగానో కష్టపడుతున్నట్లు ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఆయన తన ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించారు. తాజగా విడుదలైన ఓ వీడియో లో కూడా వరుణ్ తేజ్ ఎంతో కష్టపడుతున్నాడు. పాత్ర కోసం కటోర వ్యాయామం చేస్తున్నాడు.
బాక్సింగ్ లో కూడా ఎంతో కఠోరమైన శిక్షణ పొందారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర లో నటిస్తుండగా ఉపేంద్ర ప్రతినాయకుడి పాత్రలో కనిపించడం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ముఖ్యకారణం. వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మరి వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఏ రేంజ్ లో హిట్ అందుకుంటాడో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి