కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య ఎటువంటి సినిమాలో నటించినా సరే ఆ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు ఈయన కథలు ఎంచుకునే విషయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి కూర్చుని చర్చించుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. జ్యోతిక ఒక వైపు నుంచి ఆలోచిస్తే, సూర్య మరో కోణంలో ఆలోచించి, ఈ సినిమాలో ఎలా చేస్తే బాగుంటుంది..ఈ కథ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి మరి వీరు సెలెక్ట్ చేసుకుంటారని వార్తలు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.ఇక భార్య , భర్త కలిసి తీసుకొనే నిర్ణయం కాబట్టే సూర్య నటించబోయే సినిమాలు కూడా అత్యంత విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులకు అతి చేరువలో ఉంటాయి.. అని ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. ఆయన నటించిన సెవెన్త్ సెన్స్, బందోబస్త్, ఆకాశం నీ హద్దురా వంటి సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందిన సూర్య తాజాగా జై భీమ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కోర్టు డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులలో విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన నటించిన రాజిష విజయన్ గురించి ప్రతి ఒక్కరు గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు.సూర్య సరసన హీరోయిన్ గా నటించిన ఈ అమ్మాయి ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చింది..? ఇండస్ట్రీలో కి రాకముందు ఏం పని చేసేది..? ఎలా ఉండేది..? అని ప్రతి చిన్న విషయం కూడా ఈమె గురించి ఆరా తీయడం గమనార్హం. ఈమె కేరళ రాష్ట్రంలోని కాలికట్ లో జన్మించింది.. విద్యాభ్యాసం విషయానికొస్తే డిగ్రీ పూర్తి చేసిన రాజిష సినిమాల్లోకి రాకముందు టీవీ యాంకర్ గా పని చేసేది. ఇక ఆ తర్వాత తమిళ్, మలయాళం సినిమా ఇండస్ట్రీలో సుమారుగా పది చిత్రాలకు పైగా నటించి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు త్వరలోనే పరిచయం కానుంది. ఇక ప్రస్తుతం జై భీమ్ సినిమాలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: