భారతదేశ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన నటుడు ప్రకాష్ రాజ్. ఆయన నటుడిగా ఎంతటి గొప్ప స్థానాన్ని అందుకుని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయాడో అందరికీ తెలిసిందే. ఎలాంటి పాత్ర ఇచ్చిన అవలీలగా తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను ఆ పాత్ర ద్వారా మరింత మెప్పించి వారికి దగ్గర అవుతూ ఉంటాడు ప్రకాష్ రాజ్.
సినిమా పరిశ్రమలోకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తయిన కూడా ఆయన నటనకు ఆయన హావభావాలకు ప్రేక్షకులు ఏమాత్రం బోర్ ఫీల్ అవలేదు అంటే ఏ స్థాయిలో తనను తాను
ప్రకాష్ రాజ్ మలుచుకున్నాడో అర్థం అవుతుంది.
మొన్నటి దాకా నటుడు గా తన పని తాను చేసుకుంటూ పోతూ ఎలాంటి వివాదాల జోలికి పోకుండా ఉండే వాడు. వరుస సినిమాలలో ముఖ్యమైన పాత్రలు విలన్ పాత్రల తో పాటు మంచి మంచి సినిమాలు చేస్తూ నిర్మిస్తూ నిర్మాతగా కూడా ఆయన సినిమాల పట్ల ఆయనకున్న ప్యాషన్ వెల్లడించారు. ఇక ఆయన దర్శకత్వం లో కూడా ఓ
సినిమా తెరకెక్కింది. ఈ విధంగా సినిమాలు చేస్తు
సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించడమే ధ్యేయంగా ఆయన ముందుకు పోగా ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా వివాదాల్లో ఇరుక్కోవడం ఆయన అభిమానులకు ఏమాత్రం సంతృప్తి పరచడం లేదు.
మా ఎన్నికల సమయంలో ఆయన చేసిన
రచ్చ అంతా ఇంతా కాదు. తనకు పోటీగా నిలబడే అభ్యర్థులు ఎన్నో విమర్శలు చేస్తూ తాను కూడా విమర్శల పాలు అయ్యాడు. ఎన్నికలలో
ప్రకాష్ రాజ్ సంచలనం సృష్టించి ఓటమితో తిరిగాడు. ఇక తాజాగా ఆయన
సూర్య నటించిన జై
భీమ్ అనే చిత్రంలో చేసిన పాత్రకు కూడా ఎన్నో విమర్శలు ఎదురవుతున్నాయి. ఓ మార్వాడి శెట్ తమిళం లో మాట్లాడు అని కొట్టే సందర్భం ఉత్తరాది ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో ఉత్తరాదిన బలంగా ఉన్న
బిజెపి పార్టీ వారు
ప్రకాష్ రాజ్ ను విమర్శించడం మొదలుపెడుతున్నారు. గతంలో
బీజేపీ పార్టీని ఎన్నోసార్లు దూషించిన ప్రకాష్ పై ప్రతీకారంగా ఇప్పుడు వారు ఈ చర్యలకు పాల్పడుతున్నారని చెప్పవచ్చు. దీనిపై
ప్రకాష్ రాజ్ కూడా వివరణ ఇవ్వడం గమనార్హం.