భారతీయ చలనచిత్ర నటుడుగా, దర్శకుడిగా , విలన్ గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు సముద్రఖని.తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈయన మలయాళంలో , తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు..మొదట ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా అన్ని విభాగాలలో నైపుణ్యం పెంచుకొని , ఆ తర్వాత 2009 లో మొదటిసారి నాడోడిగల్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ తర్వాత తమిళ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఎంతో మందికి గుర్తింపు వచ్చేలా చేశారు.2016 లో ఈయన నటించిన విసరనై అనే చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలన చిత్ర అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఉత్తమ సంభాషణల రచయితగా కూడా విజయ అవార్డ్ ను గెలుచుకున్నారు. నటుడిగానే మాత్రమే కాదు బుల్లితెరపై కూడా నటుడిగా ఎన్నో సీరియల్స్ లో నటించారు. రాజ్ టీవీ , సన్ టీవీ, జయ టీవీ , స్టార్ విజయ్ వంటి ప్రముఖ తమిళ్ చానల్స్ లో వచ్చే సీరియల్స్ లో నటించిన సముద్రకని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. తెలుగులో 2010లో వచ్చిన రవితేజ సెన్సేషనల్ హిట్ సినిమా శంభో శివ శంభో సినిమా లో కారు డ్రైవర్గా అతిథి పాత్రలో నటించాడు. అక్కడ ఈయనకు పెద్దగా గుర్తింపు రాలేదు.. కానీ ఈ సంవత్సరం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన క్రాక్ సినిమా ద్వారా కటారి కృష్ణగా విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులు అయ్యారు.ఇక ఇప్పుడు ఎన్నో సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అవుతున్న ఈయన.. దర్శకులు కూడా విలన్ గా సముద్రఖని ఎంచుకోవడం గమనార్హం అంతేకాదు ప్రతి సినిమాలో కూడా విలన్ పాత్ర పోషించారు. ఆకాశవాణి, ఆర్ ఆర్ ఆర్, సర్కారు వారి పాట ,భీమ్లా నాయక్ వంటి సినిమాలలో కూడా ప్రస్తుతం నటించాడు. అయితే ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: