మెగాస్టార్ వారసుడిగా చిరుత సినిమా తో టాలీవుడ్ కి హీరో గా పరిచయం అయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన హీరోగా నటించిన రెండో సినిమా మగధీర తో నే ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసుకునేలా చేశాడు చెర్రీ. రాజమౌళి దర్శకత్వంలో ఆయన చూసిన మొదటి సినిమా ఏ స్థాయిలో సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోనే ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు.

ఎన్టీఆర్ తో కలసి ఆయన ఈ సినిమా లో నటిస్తుండగా ఈ చిత్రం ద్వారా తొలిసారి గా ఇండియా హీరో గా దేశవ్యాప్తంగా పరిచయం కాబోతున్నాడు. మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోగా వాటికి తగ్గట్టుగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో పాటే నెల రోజుల వ్యవధిలోనే రామ్ చరణ్ తా ను నటిస్తూ నిర్మించిన ఆచార్య సినిమాను కూడా విడుదల చేస్తున్నాడు.

 మెగా అభిమానులు నెల రోజుల వ్యవధిలోనే తమ హీరోను తెరపై రెండు సార్లు చూడవచ్చు అని ఎంతో సంబరపడుతున్నారు. అంతేకాదు ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే ఆయన తన తదుపరి సినిమా ను శంకర్ కు సంబంధించిన సినిమా విడుదల ను అతి త్వరలోనే చేయనున్నాడట. అంటే ఓకే సంవత్సరం రాంచరణ్ సినిమాలను 3 చూడొచ్చు అనే ఆలోచన మెగా అభిమానులను ఎంతగానో ఖుషీ చేస్తుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా రామ్ చరణ్సినిమా చేస్తున్న విషయం తెలిసిం దే. ఈ నేపథ్యంలో మూడు సినిమాలతో వచ్చే ఏడాది ప్రేక్షకులను బాగానే అలరించబోతున్నాడు రామ్ చరణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: