ఒక సరికొత్త కాన్సెప్ట్ తో పుష్పకవిమానం అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు దామోదర్ గురించి చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. పెళ్ళాం లేచిపోయింది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే దర్శకుడు దామోదర్ తండ్రి పేరుమోసిన కథా రచయిత. ఇక ఆయన తాత నక్సలైట్ల నాయకుడు. కానీ ఆయన మాత్రం తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెండితెర పై అడుగు పెట్టాడు. రౌడీ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ను హీరోగా పెట్టి పుష్పకవిమానం అనే సినిమాను తెరకెక్కించాడు.


సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సినిమా దర్శకుడు తండ్రి ప్రముఖ కథారచయిత అయిన అట్టాడ అప్పలనాయుడు.. ప్రస్తుతం ఈయన శ్రీకాకుళం జిల్లాలోని విశాఖ ఏ కాలనీలో నివాసం ఉంటున్నారు. దామోదర్ అసలు పేరు సృజన్. ఈయన తాత ప్రముఖ నక్సలైట్ నాయకులైన మామిడి అప్పలసూరి. ఈయన  స్వగ్రామం కోమర్తి. సృజన మొదట్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేవారు. ఆ తర్వాత సినిమా మీద ఇష్టం ఉండడం తో మొదటి సారి తెలుగు కథలు గా చెప్పుకునే గురజాడ దిద్దుబాటు ఆధారంగా అనే ఒక షార్ట్ ఫిలిం తీశాడు.. ఇక ఈ షార్ట్ ఫిలిం అప్పట్లో దాసరి నారాయణరావు కూడా మెచ్చుకోవడం గమనార్హం..

గురజాడ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఈ షార్ట్ ఫిలిం తోనే మొదటి బహుమతిని గెలుపొందాడు. ఇక తర్వాత ఒక గిరిజన విద్యార్థిని స్కూల్ బాట పట్టించే కథాంశంతో తెరకెక్కిన సన్నాయి షార్ట్ ఫిలిం కి కూడా దర్శకత్వం వహించారు..దీని ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది..తాజాగా ఫిల్మ్ సిటీలో పుష్పకవిమానం సినిమా మంచి బజ్ ను క్రియేట్ చేస్తోంది. తాజాగా దర్శకుడు సృజన్ పుష్పకవిమానం సినిమా గురించి మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధనరావు గారి ప్రోత్సాహంతో ఈ సినిమాను తెరకెక్కించాను అని తెలిపాడు.. నూతన నటి నటులను, దర్శకులను ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తారు.. అందులో భాగంగానే తన చిన్న కొడుకు తో ఈ సినిమా తీయమని చెప్పడంతో నేను చాలా సంతోషించి, కామెడీ..థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించాను అంటూ ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: