ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరోలు అంతా దుబాయ్ లో అత్యంత విలాసవంతమైన విల్లాలు కొనుక్కుని అవకాశం చిక్కినప్పుడల్లా అక్కడకు వెళ్ళి తమ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతూ మన టాలీవుడ్ టాప్ హీరోలు కూడ దుబాయ్ లో ఖరీదైన విల్లాలు కొనుక్కుందామని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా త్వరలో విడుదల కాబోతున్న అత్యంత భారీ తెలుగు సినిమాల పబ్లిసిటీకి దుబాయ్ వేదికగా మారబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. గతంలో రజినీకాంత్ ‘రోబో 2.0’ మూవీ ఆడియో ఫంక్షన్ ను కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి దుబాయ్ లో నిర్వహించారు.
లేటెస్ట్ గా విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘కురుప్’ మూవీ ట్రైలర్ ఫంక్షను కూడ దుబాయ్ లో నిర్వహించారు. ఇప్పుడు సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ఆడియో ఫంక్షన్ ను అత్యంత భారీగా దుబాయ్ లో నిర్వహించ బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని డిసెంబర్ లో విడుదల కాబోతున్న ‘పుష్ప’ యూనిట్ కూడ అనుసరిస్తున్నట్లు టాక్. ఈ రెండు ఫంక్షన్స్ కు ఈ మూవీ నిర్మాతలు కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీలు కాబట్టి బాలీవుడ్ లో ఈ మూవీల పై క్రేజ్ పెరగడానికి ఇలా దుబాయ్ ప్రమోషన్ కు శ్రీకారం చుడుతున్నట్లు టాక్. అంతేకాదు ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను హైదరాబాద్ లో అదేవిధంగా తిరుపతి లేదంటే విశాఖపట్నంలో కూడ నిర్వహించడానికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల ప్రమోషన్ కోసం 15 కోట్లకు పైగా ఖర్చు పెట్టబోతున్నారు అని వస్తున్న వార్తలను బట్టి భారీ సినిమాల పబ్లిసిటీకి ఏ రేంజ్ లో ఖర్చు పెట్టవలసి వస్తోందో అర్థం అవుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి