
ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. అంతేకాదు ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం లో టాప్ టీం లీడర్ గా కొనసాగుతున్నాడు సుడిగాలి సుధీర్. అయితే జబర్దస్త్ లో ఇతర టీం లీడర్స్ అందరూ కూడా సుడిగాలి సుధీర్ పై ఏదో ఒక విధంగా పంచులు వేయడం అందరికీ కామెడీ పంచడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక సుడిగాలి సుధీర్ కూడా ఇక అందరూ వేసిన పంచులను ఎంతో పాజిటివ్గా తీసుకుంటూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు.
ఇటీవలే తన పేరునే మార్చుకున్నాడు సుడిగాలి సుధీర్. మొన్నటివరకు జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ గా ఉన్న తన పేరును ఏకంగా సొరంగాల సుధీర్ గా మార్చుకున్నాడు. అయితే ఇది నిజ జీవితంలో కాదు జబర్దస్త్ లో వచ్చిన ఒక స్కిట్ లో.ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అంటూ సుడిగాలి సుధీర్ స్కిట్ ప్రారంభ మవుతుంది. స్కిట్ లో ఎంతో బుద్ధిమంతుడిలాగా తండ్రి ముందు చదువుకుంటూ ఉంటాడు సుడిగాలి సుదీర్. కానీ తండ్రి బయటికి వెళ్ళగానే స్నేహితులను పిలుస్తాడు. ఇక ఇంతలో పక్కనే ఉన్న ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలిస్తే ఎలా అంటూ అడుగుతారు ఇంట్లో వాళ్లకి కేవలం సుధీర్.. బయటికి వస్తే సొరంగాల సుధీర్ అంటూ తన పేరును మార్చుకుంటాడు సుధీర్. ఇక ఈ డైలాగ్ చెప్పగానే అందరూ కడుపుబ్బ నవ్వుతారు.