ఇటీవల కాలంలో కమర్షియల్ చిత్రాలు రొమాంటిక్ సినిమాలు ప్రేమకథా చిత్రాలే ఎక్కువగా ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. ఎప్పుడో కానీ సామాజిక స్పృహ కలిగి న సినిమాలు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమా సామాజిక స్పృహ తో పాటు ప్రేక్షకులను అలరించే విధంగా మంచి సూపర్ హిట్ అయ్యింది. సూర్య నటించిన గత రెండు మూడు సినిమాలు కూడా ప్రేక్షకులలో సామాజిక స్పృహ కలిగించేలా ఉన్నాయి.

ఇప్పుడు ఈ జై భీమ్ సినిమా కూడా అదే విధంగా ఉంటూ ఆయనను ప్రేక్షకులకు సరికొత్త గా పరిచయం చేసింది. తప్పుడు కేసుతో పోలీసులకు చిక్కిన తన భర్త అదృశ్యం చుట్టూ ఉన్న మిస్టరీ ఛేదించడానికి ఒక గిరిజన మహిళ అలాగే ఒక నీతి నిజాయితీ కలిగిన న్యాయవాది ఏవిధంగా కోర్టులో పోరాడారు. పోలీసుల అన్యాయాల నుంచి ఆ అమాయకుడు తప్పించుకున్నాడా అనేదే ఈ సినిమా. భారతదేశంలో గిరిజనుల మీద జరుగుతున్న ఎన్నో అన్యాయాలను బయటపెట్టి విధంగా ఈ సినిమా తెరకెక్కింది. 

గతంలో కుల వ్యవస్థ ఎక్కువగా ఉన్న రోజులలో గిరిజనులను మనుషులుగా కూడా పరిగణించే వారు కాదు కొంతమంది పెద్ద కులం ప్రజలు. అలాంటి సమయం లో పెద్ద కులాల వారు తప్పు చేసి నా కూడా వారిని కొమ్ము కాస్తూ ఆ కేసులలో గిరిజన పేద ప్రజలను ఇరికించి వారికి జీవితాంతం జైలు శిక్ష పడేలా చేసే వారు కొంతమంది పోలీసులు. దీన్ని ఇతివృత్తంగా తీసుకు ని ఇప్పటి తరానికి అర్థమయ్యేలా దర్శకుడు జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కించారు. సూర్య లాయర్ పాత్ర లో సరిగ్గా ఒదిగిపోయాడు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా అది ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ప్రేక్షకులనుంచి కూడా ఈ సినిమా నుంచి మంచి స్పందన దక్కుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: