టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద గా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఏకంగా తెలుగు తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్ చిరంజీవి జీవితం సినిమా పరిశ్రమలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రావాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పాలి. ఇలా మెగాస్టార్ ఆదర్శంగా తీసుకుని ఇప్పటివరకూ ఎంతోమంది టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారిలో యువ హీరోలు కార్తీకేయ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయమయ్యాడు కార్తికేయ. ఇక ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు కార్తికేయ. అయితే ఇటీవలే  హీరో కార్తికేయ తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే కార్తికేయ పెళ్ళికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి కార్తికేయ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. తన అభిమాన హీరో తన పెళ్లికి రావడంతో కార్తికేయ ఉబ్బితబ్బిబ్బైయ్యాడు. ఇటీవలే తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు కార్తికేయ. నేను పెద్దయ్యాక హీరో అవుతాను అప్పుడు నా పెళ్ళికి చిరంజీవి కూడా వస్తారు అని చిన్నప్పుడు చెప్పాను  ఇక ఇప్పుడు ఆ కల నిజమైంది. నా పెళ్ళికి మెగాస్టార్ వచ్చి ఆశీర్వచనాలు అందించారు అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: