'అర్జున్ రెడ్డి, గీత గోవిందం' హిట్స్‌తో విజయ్‌ దేవరకొండ స్టార్‌ లీగ్‌కి దగ్గరయ్యాడు. అతి తక్కువ సమయంలోనే టాప్ రేసులో జాయిన్ అయ్యాడని ఇండస్ట్రీ జనాలు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సూపర్‌ హిట్స్‌ తర్వాత విజయ్‌కి వరుస షాకులు తగిలాయి. 'నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాపులతో మార్కెట్‌ కూడా పడిపోయింది. 'గీత గోవిందం' సమయంలో విజయ్‌ దేవరకొండ మార్కెట్‌ 100 కోట్ల వరకు వెళ్లింది. కానీ 'వరల్డ్ ఫేమస్ లవర్' అయితే 40 కోట్లని కూడా చేరలేకపోయింది. విజయ్‌ దేవరకొండ కంపల్సరీగా హిట్‌ కొట్టాల్సిన స్టేజ్‌లో 'లైగర్'కి సైన్ చేశాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా తెరకెక్కుతోందీ సినిమా. ఇక ఈ బాక్సింగ్‌ డ్రామాలో మైక్‌ టైసన్‌ కూడా నటిస్తున్నాడు. ఈ బాక్సింగ్‌ లెజెండ్‌ ఎంట్రీతో 'లైగర్‌'పైనా అంచనాలు పెరిగాయి.

ప్రమోషన్‌ ఎంత పీక్స్‌లో ఉంటే, బిజినెస్‌ కూడా అదే రేంజ్‌లో జరుగుతుంది. అందుకే ఫిల్మ్‌మేకర్స్ చాలామంది షూటింగ్‌ పూర్తవ్వగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తుంటారు. ఇక పబ్లిసిటీ మాస్టర్‌ విజయ్‌ దేవరకొండ అయితే 'లైగర్‌' సెట్స్‌ నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టాడు. మైక్‌టైసన్‌తో కలిసి ప్రమోషన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్తున్నాడు. విజయ్ దేవరకొండ 'లైగర్‌'పై చాలా హోప్స్‌ పెట్టుకున్నాడు. వరుస ఫ్లాపులతో స్లో అయిన కెరీర్‌కి 'లైగర్' బూస్టప్‌ ఇస్తుందనే ఆశలో ఉన్నాడు. 'డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాపులతో పడిపోయిన గ్రాఫ్‌ని మళ్లీ ట్రాక్‌ ఎక్కించడానికి బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగాడు. ఇక ఈ సినిమా కోసం థాయిలాండ్‌లో మార్షల్‌ ఆర్ట్స్ ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాడు. బాడీ బిల్డర్‌లా మారాడు.

'లైగర్' సినిమా తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా రూపొందుతోంది. నార్త్‌ మార్కెట్‌కి సెట్‌ అవుతుందని అనన్యాపాండేని హీరోయిన్‌గా తీసుకున్నారు. కరణ్‌ జోహార్‌ భాగస్వామ్యంతో ముంబాయిలో కూడా ఈ మూవీపై హైప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌టైసన్‌ ఎంట్రీ ఇచ్చాక ఈ మూవీ స్కేల్‌ మరింత పెరిగింది. 'లైగర్‌' ప్రస్తుతం అమెరికా షెడ్యూల్‌లో ఉంది. ఈ షెడ్యూల్‌లోనే మైక్‌ టైసన్‌ జాయిన్ అయ్యాడు. బాక్సింగ్‌ చాంపియన్‌ ఎంట్రీతో 'లైగర్'కి మరింత జోష్‌ వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: