ఒమైక్రాన్ వైరస్ తో ఇండియాలో థర్డ్ వేవ్ మళ్ళీ ప్రారంభం అవుతుందా లేదా అన్న విషయమై ప్రస్తుతానికి ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. అయితే దేశంలో మరొకసారి థర్డ్ వేవ్ విశ్వరూపం కనిపిస్తుందని మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు ఎదురౌతాయి అన్నప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.



ఇప్పుడు ఈ ప్రచారమే ఈనెల 17న విడుదల కాబోతున్న ‘పుష్ప’ మూవీ నిర్మాతల నుండి జనవరి 14న విడుదల కాబోతున్న ‘రాథే శ్యామ్’ నిర్మాతల వరకు అందర్నీ వెంటాడుతోంది. సంక్రాంతి రేస్ కు రాబోతున్న భారీ సినిమాలు అన్నీ అత్యంత భారీ కలక్షన్స్ పై ఆశలు పెట్టుకున్నాయి.



టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఈమధ్య తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో కలిసినప్పుడు ఇప్పట్లో ధియేటర్లు మూసివేయడం కాని 50శాతం ఆక్యుపెన్సీ కి సంబంధించిన నిర్ణయాలు ఏమిలేవు అని సంకేతాలు వస్తున్నప్పటికీ ఒమైక్రాన్ ఉప్పెన ముంచుకు వస్తే ఈ నిర్ణయాలు మారిపోతాయి కదా అన్న భయంలో ఇండస్ట్రీ ప్రముఖులు ఉన్నట్లు టాక్. ‘పుష్ప’ మూవీ విడుదలకు సంబంధించి ఇక కేవలం 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈమూవీ ఆశించిన కలక్షన్స్ రావాలి అంటే ఈమూవీ ప్రమోషన్ ను ఇప్పటి నుంచే ప్రారంభించాలి.



అయితే ఈమూవీ ప్రమోషన్ భారీ ఎత్తున మొదలుపెట్టి తిరిగి రెండు వారాలు తరువాత పరిస్థితులు మరింత చేయిదాటిపోతే ఏమి చేయాలి అన్న కన్ఫ్యూజన్ భారీ సినిమాల నిర్మాతలలో ఉంది. దీనితో మరో రెండు వారాలలో విడుదల కావలసి ఉన్న ‘పుష్ప’ ఆతరువాత విడుదల కావలసి ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాల ప్రమోషన్ మొదలు పెట్టాలా లేదంటే మరో రిలీజ్ డేట్ అన్వేషణ చేయాలా అన్న కన్ఫ్యూజన్ లో భారీ సినిమాల నిర్మాతలు ఉన్నట్లు టాక్. పరిస్థితులు ఇలా ఉంటే ధియేటర్లకు వస్తున్న ప్రేక్షకులలో సగం మంది మాస్క్ లు లేకుండా కనిపిస్తున్న పరిస్థితులలో ముప్పు తప్పదు అన్న అంతర్మధనంలో భారీ సినిమాల నిర్మాతలు ఉన్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: