టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాప్ హీరో గా ఉన్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా ఒకటి కాగా మరొకటి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ చిత్రం మరొకటి. ఈ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరుచుకున్నాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగార్జున ఈసారి తప్పకుండా మంచి హిట్ సినిమా చేసి అక్కినేని అభిమానులను ఎంతగానో ఖుషీ చేయాలని భావిస్తుండగా ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరుస్తున్నాయి.

ముఖ్యంగా బంగార్రాజు సినిమా విషయంలో నాగార్జున బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో తనతో పాటు కొడుకు అక్కినేని నాగచైతన్య కూడా హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని అక్కినేని నాగార్జున ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలూ ప్రేక్షకుల ముందుకు రాగా అవి సినిమాపై మంచి అంచనాలను ఏర్పడతాయి.

అయితే కృతి శెట్టి ని హీరోయిన్ గా ఎంచుకుని ఈ సినిమాపై మంచి క్రేజ్ ను తీసుకురాగా ఇప్పుడు నాగార్జున మరొక బ్యూటీని ఈ సినిమాలో నటింప చేసి క్రేజ్ ను మరింతగా పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకులందరికీ పరిచయమై మంచి క్రేజ్ తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతుంది. దీని ద్వారా సినిమా పై మంచి క్రేజ్ తెచ్చుకున్న నాగార్జున మరిన్ని ఆసక్తి పరిచే విషయాలు  ఈ చిత్రం లో ఉండే విధంగా నాగార్జున చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నవి అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రోజుకో చర్చ ఎక్కువ అవుతుంది. మరి సోగ్గాడే చిన్నినాయన రేంజ్లో ఈ చిత్రం విజయం సాధిస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: