ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాని సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటించారు. అంతేకాదు.. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అనసూయ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ ఫార్ట్ ‘పుష్ప ది రైజ్’ భారీ అంచనాల నడుమ నిన్న అట్టహాసరంగా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది. అయితే ముఖ్యంగా ఈ చిత్రంలో పుష్ప రాజ్‌గా బన్నీ వన్‌ మ్యాన్‌ షో చేశారు. అంతేకాదు.. లుక్ పరంగానే కాదు నటన పరంగానూ బన్నీ మెస్మరైజ్ చేశారనే చెప్పాలి. కాగా.. పాలు అమ్ముకునే మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీవల్లీ పాత్రలో రష్మిక నటించారు. ఇక ఈ సినిమాకి పెద్ద మైనస్‌గా మారిందని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.

ఈ సినిమాని ఆల్రెడీ రెండు భాగాలుగా చేయాలని ఫిక్స్ అయినప్పుడు.. మొదటి భాగం క్రిస్పీగా ఉండుంటే బాగుండేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. సినిమా నిడివి తగ్గి ఉంటే.. సినిమా ఎక్కడా ‘తగ్గేదేలే’ అనిపించేదని చెబుతున్నారు. అయితే ముఖ్యంగా బన్నీ, రష్మిక ట్రాక్ అంతా ఆకట్టుకోకపోగా.. ప్రేక్షకులకు విసుగు పుట్టించాయని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే సినిమాలో వీరిద్దరి లవ్ ట్రాక్‌ను బాగా ఇరికించినట్లు ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక రెండో భాగంలోనూ కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయని చెప్పుకొస్తున్నారు. ఈ తరుణంలోనే సుకుమార్ సినిమాలో రష్మికకు సంబంధించిన పలు సన్నివేశాలను మరియు ప్రేక్షకులకు బాగా విసుగు పుట్టించిన సన్నివేశాలను ట్రిమ్ చేసి లేపేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే నిజమైతే రష్మిక ఫ్యాన్స్‌కి షాక్ తప్పదనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: