రవితేజతో ఈ యేడాది క్రాక్ లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన గోపీచంద్ బాలయ్య కోసం అదిరిపోయే కథను రెడీ చేసినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్ సినిమా తర్వాత బాలయ్య - అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రానుంది. వరుస హిట్లతో జోష్ మీద ఉన్న అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా అనిల్ రావిపూడి స్టైల్ లో కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆ తర్వాత బాలయ్య కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి తెరకెక్కించిన క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అయితే క్రిష్ సినిమాకు ముందు లేదా తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. రామానుజాచార్యుల కథతో ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నలుగురు దర్శకులు బాలయ్య నెక్ట్స్ సినిమాల లైనప్‌లో ఉండగా.. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ తో పాటు వివి. వినాయక్ సైతం బాలయ్యతో సినిమాలు చేసేందుకు కథలు రెడీ చేసుకుని ఉన్నారు. మరి పై నాలుగు సినిమాల తర్వాత బాలయ్య ఎవరికి కమిట్ అవుతారో ? చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి