మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్,  ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్ లుగా నటిస్తూండగా, అజయ్ దేవగన్, సముద్ర కని ప్రధాన పాత్రలో నటించారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్రబృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమాను జనవరి 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ గా తెలియజేసింది.

సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు,  ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం బాలీవుడ్ లో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతోంది, ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లాంచ్ ను ముంబై లో చేసిన ఈ చిత్ర బృందం, కొన్ని రోజుల క్రితమే ఎంతో అట్టహాసంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ముంబైలో ముగించేసింది. ఇది మాత్రమే కాకుండా హిందీలో ఫుల్ గా పాపులారిటీ ఉన్న టీవీ షో లకు కూడా గెస్ట్ గా వెళ్లి ఈ చిత్ర బృందం సందడి చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా హిందీలో చాలా పాపులారిటీ ఉన్న కామెడీ నైట్స్ విత్ కపిల్ షో కు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం వెళ్ళింది, ఇందులో భాగంగా ఈ షో లో రామ్‌ చరణ్‌ ను కపిల్‌ శర్మ ప్రశ్నిస్తూ.. ‘మీకు ఎయిర్‌లైన్స్‌, హాస్పిటల్స్‌, హోటల్స్‌ ఇతర వ్యాపారాలుండగా ఎందుకు సినిమాల్లో నటిస్తున్నారు’ అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ రామ్ చరణ్ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఉన్నా ఈ షో కి వచ్చే అవకాశం ఉండదు కదా’ అని తనదైన శైలి లో సమాధానం ఇచ్చారు. రామ్ చరణ్ ఇలా సమాధానం చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: