ఒకప్పుడు సినిమా థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలి అంటే ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఇష్టపడే వారు. ముఖ్యంగా ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చిందంటే ఇక ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్లి సినిమా థియేటర్ లో సినిమా చూసే వారు. ఇక ఇలా సినిమా థియేటర్ లో కొత్త సినిమాలను ఫ్యామిలీతో కలిసి వీక్షించడం ప్రతి ప్రేక్షకుడికి మాటల్లో చెప్పలేని అనుభూతిని పంచుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ప్రస్తుతం థియేటర్కు వెళ్లి సినిమా చూడాలంటే భయపడిపోతున్నారు సగటు ప్రేక్షకుడు. ఇక ఫ్యామిలీ ని తీసుకొని వెళ్ళడం అంటే మరింత జంకుతున్నారు. కారణం కరోనా వైరస్. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత థియేటర్లు ఒక్కసారిగా మూతపడ్డాయి.



 దీంతో సినీ ప్రేక్షకులు అందరూ మొదట కాస్త నిరాశ చెందారు. కానీ ఆ తర్వాత  వైరస్ ప్రమాదం గురించి తెలిసిన తర్వాత థియేటర్లు తెరిచిన కూడా అటు సినిమా హాళ్లకు వెళ్లడానికి అందరూ భయపడిపోయారు అని చెప్పాలి. కొంత మంది ప్రేక్షకులు ప్రస్తుతం సినిమా హాల్లకి వెళ్తున్న భయం భయంగానే సినిమా చూస్తూ వస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వెళ్లాలి అంటే భయపడిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఫ్యామిలీతో సినిమా చూసేందుకు మళ్లీ పాత రోజులు వస్తే ఎంత బాగుండు అని కోరుకుంటున్నారు.



 ఇక అందరికీ పాత రోజులు తిరిగి తీసుకువచ్చేందుకు ఇక్కడ ఒక గుడ్ న్యూస్ సిద్ధంగా ఉంది. ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్లడానికి భయపడుతున్న వారికోసం ఒక ప్రత్యేకమైన థియేటర్ ప్రస్తుతం అందుబాటులోకి రాబోతోంది. స్టార్ ట్రాక్ గ్రూప్ హైదరాబాద్ లో ఫ్యామిలీ సినిమా చూసేలా థియేటర్లను అద్దెకు ఇవ్వడానికి సిద్ధమైంది. రోజుకు మూడు షోలకు అద్దెకు ఇవ్వబోతున్నారు. ఇక అతి తక్కువ రెంటుకే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ థియేటర్ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇక షో టైమింగ్ వారాన్ని బట్టి 1500 నుంచి 1900 వరకు కూడా ఈ ఫ్యామిలీ థియేటర్ రెంట్ వసూలు చేస్తారట. సికింద్రాబాద్ లోని సర్దార్ పటేల్ రోడ్డు లో ఉన్న ఈ ప్రత్యేకమైన థియేటర్ లో ఒకేసారి ఏడుగురు సినిమా చూసేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: