నాగార్జున,నాగచైతన్య హీరోలుగా రమ్యకృష్ణ, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్న చిత్రం బంగార్రాజు.. జి స్టూడియో బ్యానర్ పై అన్నపూర్ణ స్టూడియోస్ తో సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా 2016 లో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించ బడింది. అయితే ఈ నెల జనవరి 14 వ తేదీన బంగార్రాజు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా జనవరి నెల నాగార్జునకు బాగా కలిసొచ్చింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అభిమానులకు.. అయితే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే ఎలా జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1). నైజాం-11కోట్ల రూపాయలు.
2). సీడెడ్-6.30కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-4.14 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-2.88 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-2.60కోట్ల రూపాయలు.
6). గుంటూరు-3.24కోట్ల రూపాయలు.
7). కృష్ణ-2.70 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-1.45 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుని మొత్తం బిజినెస్  విషయానికి వస్తే..34.31 కోట్ల రూపాయలు
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-2 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-2 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ విషయానికి వస్తే..38.31 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.

బంగార్రాజు సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..38.31 కోట్ల రూపాయలు జరిగినది. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలంటే..39 కోట్ల రూపాయలు         రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాకి పోటీగా దిల్ రాజు కుటుంబం నుంచి యువహీరో రౌడీ బాయ్స్ అనే సినిమాతో, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరో, మెగాస్టార్ అల్లుడు నుంచి సూపర్ మచ్చి వంటి సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఇప్పటివరకు బంగార్రాజు సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం చాలా మందికి ఉంది. అయితే కరోనా వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే విషయం చెప్పలేము.

మరింత సమాచారం తెలుసుకోండి: