సౌత్ సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది హీరోయిన్ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురు అయినటువంటి ఈమె ఆరంభంలో ఎన్నో అపజయాలను కూడా చవి చూసింది. ఇక దాంతో ఈమెను ఐరన్ లెగ్ హీరోయిన్ అని కూడా పిలిచేవారు. ప్రస్తుతం ఆ ముద్రను చెరిపేసి.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. గబ్బర్ సింగ్ రూపంలో ఈమెను అదృష్టం తలుపు తట్టింది. ఇక ఈ సినిమా తరువాత ఈమె వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అంతేకాకుండా వరుస విజయాలు కూడా ఈమెకు వెళ్ళువడ్డాయి.ఇక ఈమె చేసిన సినిమాలలో బలుపు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ఎవడు వంటి సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. అంతేకాకుండా టాలీవుడ్ లోనే ఒక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ మధ్య కాలంలో ఈమె ప్రేమ వ్యవహారాలు మాత్రం బాగా వైరల్ గా అవుతున్నాయి. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది శృతిహాసన్. అయితే కొన్ని కారణాల వల్ల తన మొదటి బాయ్ ఫ్రెండ్ ఫారెన్ వ్యక్తితో విడిపోవాల్సి వచ్చింది. ఇక అటు తర్వాత కాటమరాయుడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు ఎక్కువగా సంగీతం వినడం అంటే చాలా ఇష్టం.. అంతేకాకుండా సింగర్ గా కూడా కొన్ని సినిమాలలో పాట పాడింది.శృతి హాసన్ అప్పుడప్పుడు మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేస్తూ ఉంటుందట. తరచూ తన ఫోటోలను తన అభిమానులకు అప్డేట్ కూడా ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రెబల్ స్టార్ సరసన నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. అయితే తాజాగా కొత్త బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోంది ఈమె. ఇక వారితో క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుకుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాలలో కూడా వైరల్ గా మారడం చూసే ఉంటాము.

మరింత సమాచారం తెలుసుకోండి: