కరోనా రాకముందు వరకు ఓటీటీ లో సినిమాలు విడుదల అవ్వాలంటే చాలా అరుదుగా జరిగేవి.. కానీ ప్రస్తుతం రాబోయే రోజుల్లో సినిమాలన్నీ ఓటీటీ కే పరిమితం అయ్యే అంతగా వాటి హవా కొనసాగుతోంది. దీంతో స్టార్ హీరోలు, నిర్మాతలు కూడా ఎక్కువగా ఓ టీ టీ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాలను ఎక్కువగా అందులోనే విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వరుసలో ముందుగా కోలీవుడ్ హీరో సూర్య ఉన్నాడని చెప్పవచ్చు.. ఇక అంతే కాకుండా తను నటించిన రెండు సినిమాలు కూడా అమెజాన్ లో నే విడుదల చేయడం జరిగింది.

జై భీమ్, సరరై పట్టు.. వంటి సినిమాలను తన సొంత నిర్మాణ సంస్థ లోనే నిర్మించి ఓటీటీలో విడుదల చేశాడు సూర్య. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి.. ఇక ఈ నేపథ్యంలోనే సూర్య అమెజాన్ తో ఒక భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గా వార్తలు బాగా వినిపిస్తున్నాయి.. తన నిర్మాణంలో ఏ సినిమా తెరకెక్కినా కేవలం అవి అమెజాన్ లో నే విడుదల చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు గా వార్త వినిపిస్తోంది.. అందుకు తగ్గట్టుగానే అతను సినిమాలన్నీ అమెజాన్ లోనే విడుదల అవుతూ ఉండడం గమనార్హం. థియేటర్లో విడుదల చేసే దానికంటే ఓటీటీ లోనే విడుదల చేస్తే తను సేఫ్ గా ఉంటాడు అని సూర్య, తన టీమ్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.


ఇక అంతే కాకుండా తన సినిమాలు వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్నాయి.. అనుకుంటున్నారట సూర్య. ఇక అంతే కాకుండా తన 2 డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్వహించే ఎటువంటి సినిమా అయినా  పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావాలంటే కేవలం దానికి ఉత్తమమైన మార్గం  ఓటీటీ అని సూర్య టీమ్ చాలా బలంగా నమ్ముతోందట. ఇక సూర్య బాటలో హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఒక భారీ డీల్ ఒప్పందంతో తన సినిమాలను ఓటీటీ లోనే విడుదల చేయడానికి ఒప్పుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: