సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా విడుదల తేదీని మే 12వ తేదీన నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ అభిమానుల లో భారీ స్థాయి అంచనాలను ఏర్పరిచింది అని చెప్పవచ్చు. మాస్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు కు ఈ చిత్రం తప్పకుండా భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తుందని అందరూ భావించగా ఈ చిత్రం టీజర్ అది నిజం అన్నట్లుగా నిరూపించింది.

మహేష్ కు భారీ స్థాయి ఇమేజ్ ఈ టీజర్ తో నే రాగా ఈ సినిమా విడుదల అయితే ఇంకా ఎంతటి స్థాయిలో క్రేజ్ వస్తుందో అని అభిమానులు తెగ సంబరపడ్డారు. అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న కూడా మహేష్ తెలుగు సినిమాలతోనే అంతటి స్థాయిని దక్కించుకోవడం నిజంగా ఆయనకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మహేష్ తన సినిమాకు సంబంధించిన అప్డేట్ తో ప్రేక్షకులను ఇంతవరకు అలరిస్తూ ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన విడుదలను అనౌన్స్  చేయడం ఒక్కసారిగా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 12వ తేదీన విడుదల అవుతుండడం ఒక్కసారిగా అందరినీ నిరాశ పరిచింది అని చెప్పవచ్చు. ఎందుకంటే తమ అభిమాన హీరోను తెరపై తొందరగా చూడాలని మహేష్ అభిమానుల కోరిక నెరవేరక పోవడంతో పాటు ఈ విధమైన తేదీని ఎంపిక చేసుకోవడం పట్ల ఏదైనా ప్రణాళిక ఉందని అందరూ అనుకుంటున్నారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేష్ ఈ తేదీని నిర్ణయించడానికి కారణం లేకపోలేదట. మే 12వ తేదీ నాటికి అన్ని సినిమాల విడుదల తేదీలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి వాటి ఫలితాలతో ఉంటాయి. ఈ నేపథ్యంలో మహేష్ ఆయా సినిమాల కంటే ఎక్కువగా పేరు తెచ్చుకోవాలని ఈ విధంగా చేశాడట. సోలోగా రావడానికి మహేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: