లేటు వయసులో కూడా ఘాటు అందాలతో చెలరేగుతోంది బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. యాభై ఏళ్ల కు చేరువలో ఉన్నా ఈ ముదురు భామలో మిసమిసలకు కొదవేమీ లేదని ఆమె వరుస ఫోటోషూట్లు బాగా ప్రూవ్ చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'బద్రి' సినిమాలో చాలా పద్ధతి గల అమ్మాయిగా నటించింది అమీషా పటేల్. ఇక ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ డైరెక్టర్ ఇంకా నటుడు యస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన 'నాని' సినిమాలో అయితే అమీషా ఓ రేంజిలో అందాలు ఆరబోసింది.ఇక బాలీవుడ్ లో అయితే మంచి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక రియల్ లైఫ్ లో కూడా ఈ ముదురు బ్యూటీ ఆ పేరుకి న్యాయం చేస్తుంది. అంటే తన హాట్ పిక్స్ తో యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది అమీషా పటేల్.ఇక 47ఏళ్ల ఈ హాట్ బ్యూటీ ఇప్పటికీ ఇంకా బాలీవుడ్ లో నటించేందుకు తహతహలాడుతోంది. అయితే నేటి జనరేషన్ తో పోటీకి నిలవలేకపోయిన ఈ హాట్ బ్యూటీ ఇతర భాషలపైనా దృష్టి సారించింది.

 
తాజాగా అమీషా సోషల్ మీడియాలోలో షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ ఫొటోస్ అయితే అంతర్జాలంలో వైరల్ గా మారింది. రెడ్ అండ్ బ్లూ పర్పుల్ బికినీలో అమీషా ఫోజులు యూత్ లోకి  గుండెల్లోకి దూసుకెళుతున్నాయి.అమీషా పటేల్ తెలుగులో పవన్ కల్యాణ్- మహేష్- బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సరసన నటించిన విషయం తెలిసిందే. `బద్రి`.. `నాని`..`నరసింహుడు`..`పరమవీర చక్ర` లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు అంతగా ఏమి రాలేదు. బాలీవుడ్ లోనూ కెరీర్ పరంగా బ్రేకులు పడుతూనే ఉండడం ఈమెకు చాలా పెద్ద మైనస్ గా మారింది. గత మూడేళ్లుగా పూర్తిగా సినిమాలకు అమీషా దూరమైంది. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాలుగైదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడినా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లతో అమీషా మంచి జోష్ ప్రదర్శించనుంది. `దేశీ మ్యాజిక్`..`టూబా తేరా జ్వాలా`..`ది గ్రేట్ ఇండియన్ కాసినో` సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా..`మిస్టరీ ఆఫ్ టాటూ`..`గదర్ -2` సినిమాలు అయితే ఆన్ సెట్స్ లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: