కే జి ఎఫ్ -2 సినిమా ఏడాది కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది.. ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు సినిమా షూటింగ్ పూర్తి అయి ఎన్నో రోజులు కావస్తోంది.. ఈ సినిమాలోని చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే కే జి ఎఫ్ సినిమా లో హీరోయిన్ గా నటించింది శ్రీనిధి శెట్టి.. తాజాగా సోషల్ మీడియా ద్వారా చాలా రోజుల తర్వాత ఒక అప్ డేట్ ను ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ.
అదేమిటంటే తన కు సంబంధించి షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లుగా ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది. తాజాగా తన సినిమాకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేసుకున్న ట్లుగా తెలియజేసింది. అందుకు సంబంధించిన ఒక స్టిల్ ను కూడా క్రియేటివ్ గా జోడించి పోస్టర్. ఇక కే జి ఎఫ్-2 మూవీకి సంబంధించి ఏ చిన్న విషయమైనా సరే బాగా వైరల్ గా మారుతోంది. గత సంవత్సరం ఈ సినిమాని ఎటువంటి హడావుడి లేకుండా విడుదల చేయాలనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి