కొంత మంది హీరోయిన్ లకు కొన్ని కొన్ని సినిమా పరిశ్రమలో ఎంత బాగా నటించినా కూడా ఆమెకు అసలు గుర్తింపు రాదు. అందానికి అందం నటనకు నటన గ్లామర్ గ్లామర్ ఉన్నా కూడా హీరోయిన్ కు ఆవగింజంత అదృష్టం ఉండకపోతే అంతే సంగతులు. అలా తెలుగు సినిమా పరిశ్రమలో దేనికైనా రెడీ అన్న హీరోయిన్లు సైతం అదృష్టం లేకపోవడంతో మధ్యలోనే సినిమా పరిశ్రమను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ విధంగా నాని గ్యాంగ్ లీడర్ సినిమా లో నటించిన హీరోయిన్ ప్రియాంక మోహన్ ను ఎవరూ పట్టించుకోకపోవడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ చిత్రంలో ఎంతో సెటిల్ నటన కనబరిచిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని కొంతమంది సినిమా పండితులు జోస్యం చెప్పారు కానీ వారు అనుకోని విధంగా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అసలు అవకాశాలు లేకపోవడం అందర్నీ ఆశ్చర్య కలిగిస్తుంది. ఇదే సమయంలో ఆమె తమిళంలో వరుస సినిమాలు చేయడం విశేషం అక్కడ భారీ స్థాయిలో ఆ చిత్రాలు హిట్ అవడంతో ఆమెకు భారీ క్రేజ్ ఏర్పడుతుంది తమిళనాట.

ప్రస్తుతం పెద్ద హీరోలతో అక్కడ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెలుగులో సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ అందరూ దర్శక హీరోలు చేసిన హీరోయిన్లతో సినిమాలు చేస్తూ ఉండడంతో కొత్త వారికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ మరిన్ని అవకాశాలను సంపాదించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూడాలి. శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు మరే తెలుగు సినిమాలో కూడా సాయం చేయలేదు. మరి తమిళనాట వరస సినిమాలు చేస్తున్న విధంగా ఈమె తెలుగులో ఎప్పుడు వరస సినిమాలలో చేస్తుందో చూడాలి. తమిళంలో మంచి మంచి సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: