అఖండ సినిమాతో భారీ స్థాయిలో పాపులారిటీని అందుకున్నాడు బోయపాటి శీను. టాలీవుడ్ లో ఇప్పుడు ఆయన పేరు మార్మోగిపోతోంది అనే చెప్పాలి. ఈ చిత్రంలో బాలకృష్ణను ఆయన చూపించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఫిదా అయిపోయారు. భారీ స్థాయి లో ఈ ఇద్దరు ఈ హిట్ సాధించగా తన తదుపరి చిత్రం గురించే ఇప్పుడు టాలీవుడ్ అంతటా చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలని భావించాడు.

అయితే బన్నీ ఖాళీగా లేకపోవడంతో ఈ గ్యాప్ లో మరో సినిమా బోయపాటి శీను చేయాలని డిసైడయ్యాడు. దీంతో రామ్ పోతినేని తో సినిమా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన కోసం ఓ మాస్ అంశాలతో కూడిన సబ్జెక్టును రెడీ చేశాడట. తెలుగు తమిళ భాష గా ఈచిత్రం తెరకెక్కబోతోందని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన లింగుస్వామి దర్శకత్వంలో ఓ ద్వి భాష చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రానికి సంబందించిన రెమ్యునరేషన్ విషయం లో బోయపాటి మరొకసారి వార్తల్లోకి ఎక్కాడు. ఈ చిత్రం బోయపాటి బాలయ్య కెరీర్లోనే భారీ స్థాయిలో హిట్ అవుతుంది. ఆయన కంటే బోయపాటి శ్రీను ఎక్కువగా పారితోషకాన్ని తీసుకోబోతున్నాడు అని అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం 10 కోట్ల వరకు రామ్ పారితోషికం తీసుకుంటే ఈ సినిమాకి 12 కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకోబోతున్నాడు.  కెరీర్ ఆరంభంలో తను ఏ నిర్మాతను రెమ్యునరేషన్ అడగలేదని ఖర్చులకు మాత్రమే ఇస్తే చాలు అని చెప్పి ఇప్పుడు ఇంత స్థాయిలో ఆయన డిమాండ్ చేయడం విశేషం. ఇక ఆయన మాస్ దర్శకుడిగా ప్రేక్షకులను ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తున్నాడో తెలిసిందే. మాస్ అంటే ఇది అన్నట్లు అయన సినిమాలు ఉంటాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: