ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆయన వరుసగా భోళాశంకర్ - గాడ్‌ఫాదర్ సినిమాలలో నటించనున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో జై లవకుశ, వెంకీతో వెంకీమామ సినిమాలు చేసిన కేఎస్. రవీంద్ర (బాబి) దర్శకత్వంలో ఓ సినిమా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాక.. మళ్లీ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేసేలా ఈ సినిమా కథను దర్శకుడు బాబి డిజైన్ చేసినట్టు సమాచారం. ఈ మూవీ విషయంలో దర్శకుడు బాబి ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ అభిమాని అయిన బాబి.. అదే మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఆనందంతో తబ్బిఉబ్బవుతున్నారాని ఇండస్ట్రీ వర్గంలో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి మేకర్స్ సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే అంతక ముందు ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపించగా.. ఇక ఇప్పుడు చిరు చేసే రోల్‌కు పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా మరో టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. కాగా.. ఈ మూవీ యూనిట్ వర్గాలు, మెగా కాంపౌండ్ పీఆర్ టీం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు వాల్తేరు మొనగాడు టైటిల్ పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ తరహా మాస్ టైటిల్స్ చిరుకు బాగా యాప్ట్ అవుతాయని అనుకుంటున్నారు. ఒక్కవేళ ఈ టైటిల్‌తో చిరు వస్తే బాక్సాఫీస్ దగ్గర ఆయన అభిమానులు, మాస్ జనాల దుమ్ము రేగిపోవడం ఖాయమని భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి