సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీ లో అయినా సరే నిర్మాతలకు , హీరో హీరోయిన్లకు , డైరెక్టర్లకు మధ్య ఎంతో మంచి అవినాభావంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.. వీరంతా కలసి సినీ ఇండస్ట్రీ అనే ఒక కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలా కలిసి ఎన్నో సినిమాలకు పని చేస్తూ ఉంటారు.. ఈ నేపథ్యంలోనే ఒకరి మనస్తత్వం గురించి మరొకరు తెలుసుకుంటూ హీరోలు లేదంటే దర్శక నిర్మాతలతో బంధుత్వాలు కలుపుకోవడం కోసం కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. బయట సమాజంలో కులం , మతం అని చూసినప్పటికీ సినీ ఇండస్ట్రీలో అంతా సినీ కులం అని భావించేవారు మనసు మంచిదైతే బంధుత్వం కలుపుకోవడానికి కూడా వెనుకాడరు..

ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఎంతో మంది  స్టార్ దర్శకులు హీరోయిన్ లు పెళ్లిళ్లు చేసుకోవడం.. లేదా నిర్మాతల చెల్లెళ్లను ఆ స్టార్ హీరోలు వివాహం చేసుకోవడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తన నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు.. ఇండస్ట్రీలో తన బ్యానర్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది.. ఇప్పటికీ కూడా తన బ్యానర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కిస్తూ..ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా చలామణి అవుతున్నారు వారి వారసులు..

అసలు విషయంలోకి వెళితే .. ఈ నిర్మాత తన చెల్లెల్ని ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఆ హీరోకి తన చెల్లెలిని ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. అయితే ఆ హీరోకి అప్పటికే పెళ్లి అవడం గమనార్హం.. కానీ తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత.. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ హీరో భార్య ఏకంగా నిర్మాత పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తన భర్తను తన నుంచి దూరం చేస్తున్నాడు అనే భావనతో తీవ్రస్థాయిలో మండిపడింది.. అంతే కాదు ఎంత చెప్పినా నిర్మాత వినకపోయేసరికి తన భర్త తనకు దూరం అవుతారని భావించిన హీరో భార్య నిర్మాతను కాల్చి చంపిన ఘటన  చోటు చేసుకోవడం గమనార్హం.. ఇక ఈ విషయం అప్పట్లో తీవ్ర దుమారం కూడా రేపింది..ఇక హీరో మాత్రం ఇప్పటికీ ఎన్నో చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోగానే కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: