తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా రీమేక్ హవా కొనసాగుతోందని చెప్పవచ్చు.. ఇతర భాషలలో సక్సెస్ సాధించిన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం జరుగుతూ వస్తోంది.. ఇక ఈ మధ్య కాలంలో రీమేక్ ల జోరు మరింత పెరిగిందని చెప్పవచ్చు.. చిరంజీవి గాడ్ ఫాదర్, పోరా శంకర్ వంటి సినిమాలు కూడా రీమేక్ సినిమాలే.. ఇక పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇచ్చిన వకీల్ సాబ్ మూవీ , భీమ్లా నాయక్ మూవీ లు కూడా రీమిక్స్ సినిమాలే.. అయితే తాజాగా ఇప్పుడు ఒక తమిళ మూవీ రీమేక్ లో రానా నటిస్తున్నాడని టాక్ చాలా బలంగా వినిపిస్తున్నది ఆ సినిమా ఏంటో చూద్దాం ఇప్పుడు.



ఇక తమిళంలో హీరో శింబు నటించిన మానాడు మూవీ ఏడాది కిందట విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.. ఇందులో విలన్గా ఎస్.జె.సూర్య నటించారు. ఇక ఈ సినిమాని మీ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈ సినిమా పొలిటికల్ డ్రామా గా తెరకెక్కించిన కథాంశం తో డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా హీరో విలన్ ల మధ్య జరిగే మైండ్ గేమ్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. ఇక ఇందులో కొన్ని ఆసక్తికరమైన పాత్రలు అనూహ్యమైన మలుపులు ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే ఎన్నో సంవత్సరాలుగా శింబు కు సరైన హిట్ లేక సతమతమవుతున్న సమయంలో ఈ సినిమా కాస్త ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు. ఇందులో హీరో ఎస్.జె.సూర్య నటన అద్భుతంగా ఉండడమే కాకుండా ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాని ఒకేసారి తెలుగులో తమిళంలో విడుదల చేయాలనుకున్నారు కానీ ఈ సినిమా హక్కులను సురేష్ ప్రొడక్షన్ వారు తగ్గించుకోవడంతో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను విడుదల చేయడం కుదరలేదట. అయితే ఈ సినిమాని హీరో రానా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గా తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: