టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా ఇమేజ్ ను అందుకుంటున్న హీరో ఎవరంటే ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలి సినిమా తో ఈ ఇమేజ్ ను అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో తో తనకు ఈ మార్కెట్ లో ఎదురులేదని నిరూపించుకున్నాడు. అప్పటినుంచి మరో చిత్రాన్ని విడుదల చేయలేదు ప్రభాస్. కనీ అయన ఇమేజ్ కి ఏమాత్రం ధోకా లేదు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అయన రాదే శ్యాం సినిమా ద్వారా పేక్షకుల ముందుకు ఇప్పుడు రాబోతున్నాడు. అలా ఈ సినిమా పై భారీ అంచనాలు ప్రేక్షకులలో నెలకొన్నాయి.

ఇకపోతే ఈ సినిమా తర్వాత కూడా అయన భారీ స్థాయి లో వరుస సినిమాలను చేస్తున్నాడు. అయితే మారుతి దర్శకత్వంలో అయన ఓ చిన్న సినిమా చేస్తుండడం కూడా ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయ్యింది. మొదట్లో చిన్న హీరోలతోనే చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు పెద్ద హీరోలతో చేసే స్థాయికి ఎదిగాడు. ఈనేపథ్యంలో ప్రస్తుతం గోపీచంద్ చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమా తర్వాత అయన ప్రభాస్ కు డీలక్స్ రాజా అనే కథ ని వినిపించగా ఆ చిత్రం దాదాపుగా ఒకే అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఇకపోతే ఈ సినిమా కి ప్రభాస్ జోడిగా నటించే హీరోయిన్ దొరకకపోవడం అంతా విద్దురంగా అనిపిస్తుంది. పెద్ద హీరోయిన్ ను తీసుకుందామంటే ఇది పాన్ ఇండియా సినిమా కాకపోవడం ఒకటి అడ్దోస్తుంటే చిన్న హీరోయిన్ కి వెళదామంటే ప్రభాస్ లాంటి హీరో కి చిన్న హీరోయిన్ అంటే అభిమానులు గోల పెడతారు అనేది మేకర్స్ ఆలోచిస్తున్నారు. మరి ఈ సినిమా లో హీరోయిన్ గా మేహరీన్ ఎంపిక అయ్యిందన్న వార్తలు నిన్నటిదాకా రాగా ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత అది ఒట్టి పుకారే అని తెలుస్తుంది. మరి ఎప్పుడు దీని గురించిన అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: