సాహో సినిమా తో దర్శకుడిగా భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు దర్శకుడు సుజిత్. అంతకుముందు ఆయన చేసింది ఒకే ఒక్క సినిమా అయినా కూడా ప్రభాస్ లాంటి హీరోలతో ఆయన సినిమా చేయడం నిజంగా ఆయన అదృష్టం అని చెప్పాలి. శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమా తో ప్రేక్షకులను మెప్పించిన ఈ దర్శకుడు పెద్ద దర్శకుడు అయిపోయాడు అని అందరూ అనుకున్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో సాహో సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో దాని ప్రభావం అంతా ఈ దర్శకుడి పైనే పడింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక సినిమాని కూడా మొదలు పెట్టలేదు అంటే ఆయన కెరియర్ పై సాహో సినిమా ప్రభావం ఎంతలా చూపించిందో అర్థం చేసుకోవచ్చు. రన్ రాజా రన్ లాంటి సినిమాలు చేసినా కూడా ఆయన ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేసే వాడేమో కానీ అలా కాకుండా సాహో సినిమా అవకాశం దొరకగానే ఆ చిత్రం చేసి మూట కట్టుకొని హీరోలలో నమ్మకాన్ని కోల్పోయాడు. ఆ విధంగా సుజిత్ ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడో తెలియదు కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయన తొందర గా సినిమా చేయాలని కోరుకుంటున్నారు.
దీనికి తోడు ఆయనకు ఎంతటి బ్యాడ్ లక్ ఉంది అంటే ప్రస్తుతం చిరంజీవి హీరోగా చేస్తున్న గాడ్ ఫాదర్ చిత్రాన్ని సుజిత్ చేయవలసిన చిత్రమే. ఆ సినిమా స్క్రిప్ట్ మెగాస్టార్ ను మెప్పుంచ లేకపోవడంతో ఈ విధంగా ప్రాజెక్ట్ విడిచి పెట్టవలసి వచ్చింది ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు ఖాళీ అయిపోయిన సుజిత్ తొందరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అనేది చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి