ప్రస్తుతం
తమన్ ఏ
సినిమా చేసినా కూడా అది సూపర్ హిట్ అవుతుంది. చిన్న సినిమాకు సంగీతం అందించిన పెద్ద సినిమాకు సంబంధం సంగీతం అందించిన కూడా వాటికి వందకు వందశాతం అందరూ సంతృప్తి పడే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఏ స్టార్ హీరోను అడిగిన ఏ ప్రేక్షకుడిని పలకరించినా కూడా
తమన్ గురించి చెప్పుకుంటున్నారు. అల వైకుంఠపురం లో
సినిమా దగ్గర నుంచి
తమన్ పేరు మారు మోగిపోతుందని చెప్పవచ్చు. ఆ విధంగా
టాలీవుడ్ లో ఒకప్పుడు నేపథ్య సంగీతానికి ఫేమస్ గా ఉన్న మణి శర్మ స్థానాన్ని తన హస్తగతం చేసుకున్నాడు తమన్.
పాటలతో నేపథ్య సంగీతంతో ప్రేక్షకులలో నిత్యం నానుతూ
తమన్ అందనంత ఎత్తుకు ఎదిగాడు. పోయిన ఏడాది అఖండ
సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన
తమన్ ఆ
సినిమా కి ఇచ్చిన నేపథ్య సంగీతానికి
సంగీత అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అంతటి రేంజ్ మ్యూజిక్ ఇచ్చిన ఘనత
తమన్ కే దక్కింది. ఈ సినిమాలో
బాలకృష్ణ ను ఓ రేంజ్ లో చూపించి దానికి
బ్లాక్ బస్టర్ హిట్ వచ్చేలా చేశాడు తమన్. తాజాగా ఈ చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందిస్తుండగా ఈ
రొమాంటిక్ క్లాసికల్
లవ్ స్టొరీ సినిమాకు ఈ విధమైన నేపథ్య సంగీతాన్ని అందిస్తాడు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
రొమాంటిక్ ఫీలింగ్ ను కలిగిస్తూనే ప్రేక్షకుడిని థ్రిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది మంచి చాలెంజ్ అని చెప్పాలి. ఈ సినిమాకు మంచి సంగీతాన్ని ఇస్తే వేరే లెవెల్ కి వెళుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి
తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఏవిధంగా ఫలితాన్ని అందిస్తుంది. ఆయన గత సినిమాల లాగానే ఈ సినిమాకి కూడా బలం చేకూరుతుందా అనేది తెలియాలి. అది తెలియాలంటే ఈ నెల 11వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇక
తమన్ ప్రస్తుతం
టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని అగ్రహీరోలు అందరికీ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. చిన్న హీరోలకు సైతం ఆయనే సంగీతాన్ని అందిస్తు సినిమాపై ఉన్న
ఫ్యాషన్ ను తెలియజేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇంతటి స్థాయికి చేరుకుంటాడా చూడాలి.